Elimination Diet : ఈ ఒక్క డైట్ తో సమస్యలన్నీ మాయం

సాధారణంగా అందరికీ అన్ని రకాల ఆహారం పడదు. కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే అలర్జీకి గురవుతారు. ఫలితంగా మోషన్స్ అవడం, వాంతులు వంటివి జరుగుతుంటాయి. ఇక కొంతమంది పాలు లేదా పాలతో తయారు చేసిన పదార్థాలు తిన్నారంటే వికారంగా ఉంటుంది. మరికొంత మందికి గ్యాస్ట్రిక్ సమస్య ఎదురవుతుంది. ఇలాంటి వారితో పాటు ఫుడ్ వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసమే ఈ ఎలిమినేషన్ డైట్. ఈ డైట్ వల్ల ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

అసలు ఎలిమినేషన్ డైట్ అంటే ఏంటి అంటే… పేరుకు తగ్గట్టుగానే మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల ఆహారాన్ని ఎలిమినేట్ చేయడం. అంటే మీకు అసౌకర్యంగా అనిపించే ఆహార పదార్థాలను చాలా చాలా తక్కువగా తీసుకోవడం లేదా మొత్తానికే తినకుండా పక్కన పెట్టేయడం. ఆ తర్వాత మీలోని లక్షణాలను గమనించడానికి తిరిగి వాటిని మీ భోజనంలో చేర్చుకోవచ్చు. ఈ డైట్ కేవలం 5 లేదా 6 వారాలు పాటిస్తే సరిపోతుంది. ఫుడ్ అలర్జీ ఉన్నవారికి ఏ ఆహారం తింటే ఎలర్జీకి గురవుతున్నారో గుర్తించడానికి ఈ డైట్ బాగా ఉపయోగపడుతుంది.

ఇక ఎలిమినేషన్ డైట్ వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, వికారం, డయేరియా, గ్యాస్, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. మీ శరీరం తట్టుకోలేని ఆహారం ఏదో గుర్తించాక ఫ్యూచర్లో ఆ ఫుడ్ ని మీ డైట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టేయొచ్చు. మీకు అనుమానంగా ఉన్న ఆహారాన్ని పక్కన పెట్టి ఎలర్జీ తగ్గింది అనిపిస్తే, ఆ తర్వాత మళ్లీ అదే ఫుడ్ ను తీసుకోవడం ప్రారంభించాలి. అప్పుడు నిజంగా ఆ పదార్థం వల్లే మీకు సమస్య ఎదురవుతోందా ? అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఇక ఆహారం వల్ల కలిగే అలర్జీ వంటి లక్షణాలు మీ డైట్ ను మార్చిన నాలుగు వారాలలోపే తగ్గిపోతాయి. ఒకవేళ ఎనిమిది వారాల తర్వాత కూడా అలర్జీ తగ్గట్లేదు అంటే మీ అలర్జీకి ఆ ఆహారం కారణం కాదని గుర్తుపెట్టుకోవాలి.

- Advertisement -

ఎలిమినేషన్ దశలో సాధారణంగా తీసివేయాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణ అలెర్జీ కారకాలు : పాల ఉత్పత్తులు, గుడ్లు, వేరుశెనగలు, గింజలు,
గ్లూటెన్ అలెర్జీ కారకాలు : గోధుమలు, గోధుమ ఉత్పత్తులు, బార్లీ
సోయా అలెర్జీ కారకాలు : సోయాబీన్స్, సోయా సాస్, టోఫు, సోయా ప్రాసెస్డ్ ఫుడ్
కూరగాయల్లో టొమాటోలు, బెల్ పెప్పర్స్, వంకాయలు, బంగాళదుంపలు, మొక్కజొన్న, నారింజ, ద్రాక్ష పండ్లు, ఇతర సిట్రస్ పండ్లు, చిక్కుళ్ళు: బీన్స్, ధాన్యాలు, బఠానీలు, కాఫీ, టీ, కెఫిన్, ఆల్కహాలిక్ పానీయాలు, జున్ను, ప్రాసెస్ చేసిన మాంసం, పులియబెట్టిన ఆహారాలు (పెరుగు), సుగంధ ద్రవ్యాలు, మసాలాలు, అన్ని సాస్‌లు, ముఖ్యంగా సోయా, ఆవాల సాస్‌లు ఒక్కొక్కటిగా తీసేయాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు