Triptii Dimri : త్రిప్తి బ్యూటీ సీక్రెట్ రివీల్… అందుకేనా ఇంత అందం?

Triptii Dimri : తెరపై ఎంతో అందంగా, ముట్టుకుంటే కందిపోతారేమో అనట్టుగా ఉండే స్టార్ హీరోయిన్లు ఎలాంటి స్కిన్ కేర్ ను ఫాలో అవుతారు? వాళ్ళ అందం వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి మూవీ లవర్స్ అంతా తహతహలాడతారు. అయితే తాజాగా మోస్ట్ వాంటెడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి బ్యూటీ సీక్రెట్ బయటకు వచ్చింది. మరి ఆమె స్కిన్ కేర్ రొటీన్ ఏంటి ? అందంగా కనిపించడానికి ఏం ట్రిక్స్ ఫాలో అవుతుందో తెలుసుకుందాం పదండి.

త్రిప్తి బ్యూటీ సీక్రెట్ ఇదే

యానిమల్ తరువాత త్రిప్తి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి. కాగా  సెలబ్రిటీలు తరచుగా తమ చర్మ సంరక్షణ, మేకప్ హ్యాక్‌లను అభిమానులతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. అలాగే గతేడాది ఒక ఇంటర్వ్యూలో త్రిప్తి డిమ్రీ తన బ్యూటీ సీక్రెట్ ను పంచుకుంది. ఆ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. త్రిప్తి  మెరుస్తున్న చర్మం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించగా, తన చర్మం చాలా సున్నితంగా ఉంటుందని పేర్కొంది, అందుకే ఆమె తక్కువ కెమికల్ కంటెంట్ ఉన్న సున్నితమైన ఉత్పత్తులను ఉపయోగిస్తుందట.

త్రిప్తి మాట్లాడుతూ “నేను చాలా సాధారణ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను. నేను సున్నితమైన క్లెన్సర్‌తో నా ముఖాన్ని కడుక్కుంటాను. నా చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే అధిక రసాయనాలు ఉన్న ఉత్పత్తులకు వెంటనే రియాక్ట్ అయ్యి, ఏదో ఒక ఎలర్జీ లాంటి సమస్య వస్తుంది. ఇక మాయిశ్చరైజర్ విషయానికొస్తే.. నేను క్లినిక్ మాయిశ్చర్ సర్జ్ ని ఉపయోగిస్తాను. ఇది చాలా తేలికగా ఉంటుంది. నా చర్మానికి కరెక్ట్ గా సరిపోతుంది” అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

Triptii Dimri reacts as her Instagram followers grow by millions after Animal | Bollywood - Hindustan Times

విటమిన్ సి ముఖ్యం

ఇక డే బై డే త్రిప్తి తన స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా విటమిన్ సి సీరమ్‌ను ఉపయోగిస్తుందట. మాయిశ్చరైజర్ అప్లై చేసేముందు ఆమె సీరమ్‌ను అప్లై చేస్తుందట. సూర్యకాంతి లేని టైమ్ లో కూడా తాను సన్‌స్క్రీన్‌ను ఉపయోగిస్తానని త్రిప్తి తెలిపింది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాగే చేయాలని ఆమె తన అభిమానులకు కూడా సలహా ఇచ్చింది. దీని గురించి త్రిప్తి మాట్లాడుతూ “నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా SPFని ఉపయోగిస్తాను. ఈ అలవాటు నా చర్మాన్ని మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ రొటీన్ లో భాగంగా దీనిని ఉపయోగించాలని నేను భావిస్తున్నాను” అని చెప్పింది.

నైట్ స్కిన్ కేర్

తన రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్య గురించి త్రిప్తి మాట్లాడుతూ “రాత్రి సమయంలో నేను అదే స్కిన్ కేర్ రొటీన్ ను ఫాలో అవుతాను. మొదట నా చర్మాన్ని క్లెన్సర్‌తో క్లీన్ చేస్తాను. ఆపై నా చర్మం మృదువుగా ఉండటానికి నేను కొంచెం హెవీగా ఉండే మాయిశ్చరైజర్‌ని రాస్తాను. అలాగే డే బై డే నైట్ రెటినోల్ సీరమ్‌ని అప్లై” చేస్తాను అంటూ కంప్లీట్ గా తన బ్యూటీ సీక్రెట్ ను బయట పెట్టేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు