Urfi Javed : వాచిపోయిన ముఖంతో షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్… ఫిల్లర్స్, బొటాక్స్, ఎలర్జీ అంటూ పోస్ట్

Urfi Javed : తన వింత బట్టల కారణంగా ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షించే బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్. తాజాగా ఈ బ్యూటీ వాచిపోయిన ముఖంతో ఉన్న ఫోటోలను షేర్ చేసి షాక్ ఇచ్చింది. అసలు ఈ అమ్మాయికి ఏమైంది? ముఖం ఎందుకలా వాచిపోయింది? అనే వివరాల్లోకి వెళ్తే..

అసలు ఏమైందంటే?

తాజాగా ఉర్ఫీ వాచిన కళ్ళు, పెదవులు, ఉబ్బిపోయిన ముఖంతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ నో ఫిల్టర్ ఫోటోలను షేర్ చేసిన ఉర్ఫీ తాను ఫిల్టర్‌లను ఉపయోగించలేదని, అయితే తన ముఖం ప్రతిరోజూ ఇలాగే ఉంటుందని చెప్పింది. ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు ఫోటోలను షేర్ చేసింది. ఈ నాలుగు ఫోటోలలో ఆమె మేకప్ లేకుండా కన్పిస్తోంది. కానీ ఉర్ఫీ ముఖం చాలా ఉబ్బినట్లు కనిపిస్తుంది. అయితే ఈ బ్యూటీ తన ఫోటోలను పంచుకోవడం వెనుక ఉన్న కారణాన్ని కూడా చెప్పింది.

అవి ఫిల్లర్స్, బొటాక్స్ కాదు

ఈ ఫోటోలను పంచుకుంటూనే ఉర్ఫీ సుదీర్ఘ నోట్ కూడా రాశారు. అందులో ఉర్ఫీ ‘నా ముఖంపై చాలా గుర్తులు ఉన్నాయి. అయితే అవి ఫిల్లర్స్, బొటాక్స్ మాత్రం కావు. నాకు తీవ్రమైన అలెర్జీలు ఉన్నాయి. నా ముఖం చాలాసార్లు వాపుగా ఉంటుంది. రోజు మార్చి రోజు ఉదయాన్నే లేచి చూస్తే నా ముఖం ఇలాగే ఉంటాయి. ఇవి ఫిల్లర్లు కాదు అలెర్జీ” అంటూ క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

Urfi Javed's Reveals The Real Story Behind Her Swollen Face: 'Usual Fillers  And Botox...' | Times Now

ఉర్ఫీకి ఇమ్యునోథెరపీ

నేను ప్రస్తుతం ఇమ్యునోథెరపీ తీసుకుంటున్నాను. కానీ నెక్స్ట్ టైమ్ మీరు నన్ను వాపు ముఖంతో చూసినప్పుడు నాకు అలెర్జీ ఉందన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. నాకు 18 సంవత్సరాల వయస్సు నుండి ఇవే నా సాధారణ ఫిల్లర్లు, బొటాక్స్ (అలర్జీ). అంతే తప్ప మీరు అనుకున్న ఫిల్లర్లు మాత్రం కాదివి అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది.

ఉర్ఫీ జావేద్ రిక్వెస్ట్

ఉర్ఫీ జావేద్ చివరగా “నా ముఖం ఉబ్బినట్లు ఇంకోసారి అన్పిస్తే ఎక్కువ ఫిల్లర్లు తీసుకోవద్దని దయచేసి నాకు సలహా ఇవ్వకండి. అలర్జీ కారణంగా ఇలా జరిగిందని సానుభూతి చూపండి” అని ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేసింది. అయితే ఉర్ఫీ పరిస్థితి చూసి ఆమె అభిమానులు ఈ అమ్మాయి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కానీ మరికొంత మంది మాత్రం ఆమె సమాధానంతో కన్విన్స్ కాకుండా అందంగా ఉండడం కోసం బొటాక్స్, ఫిల్లర్లు అంటూ ప్రయోగాలు చేస్తే ఇలాగే జరుగుతుంది అంటూ కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు.

ఫేస్ అలర్జీకి కారణం ఏంటి?

ఫేస్ అలెర్జీలు అనేక కారణాల వల్ల రావచ్చు. ఉదాహరణకు మనం తినే ఆహారాలు కూడా ముఖ అలెర్జీని ప్రేరేపిస్తాయి. కొన్ని ఆహారాలను తిన్నప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ వాటిని డేంజర్ గా ఫీల్ అయ్యి, అలెర్జీలను ఎదుర్కోవడానికి యాంటీబాడీ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఫేస్ అలర్జీ లాంటివి వస్తాయి. వేరుశెనగ, గోధుమలు, ఆవు పాలు, గుడ్లు, చేప వంటి ఆహారాలు ఫేస్ అలర్జీకి కారణం కావచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు