Vijay Antony : కూతురు చనిపోయాక చెప్పులు వేసుకోవడం మానేసిన హీరో… అదే కారణమట

Vijay Antony : రీసెంట్ గా లవ్ గురు మూవీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. తను దాదాపుగా మూడు నెలల నుంచి చెప్పులు లేకుండా తిరుగుతున్నాను అనే విషయాన్ని ఒప్పుకున్న ఆయన భవిష్యత్తులో కూడా చెప్పులు వేసుకొని అంటూ తేల్చి చెప్పేశారు. మరి విజయ్ ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అని వివరాల్లోకి వెళితే…

షాకింగ్ డెసిషన్ తీసుకున్న విజయ్

విజయ్ ప్రస్తుతం తుఫాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. విజయ్ మిల్టన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, బి ప్రదీప్, పంకజ్ బోరా, డి లలిత సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే అందులో భాగంగానే ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ ఆంటోనీ చెప్పులు లేకుండా రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో మీరు ఏదైనా దీక్షలో ఉన్నారా అని ప్రశ్నించగా అసలు విషయం ఏంటో చెప్పుకొచ్చారు విజయ్ ఆంటోని.

నేను ఇప్పుడు ఏ దీక్షలో లేను. దాదాపుగా మూడు నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. ఓ రోజు చెప్పులు లేకుండా నడిచినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. పైగా చెప్పులు లేకుండా నడవడం మొదలు పెట్టినప్పటి నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. అందుకే జీవితాంతం చెప్పులు లేకుండానే నడవాలి అనుకుంటున్నాను అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు విజయ్ ఆంటోనీ.

- Advertisement -

Vijay Antony: భవిష్యత్‌లో కూడా చెప్పులు వేసుకోను.. విజయ్‌ ఆంటోని షాకింగ్  కామెంట్స్! - NTV Telugu

మల్టీ టాలెంటెడ్ హీరో

విజయ్ ఆంటోని ప్రముఖ నటుడు, సంగీత స్వరకర్త, దర్శకుడు కూడా. 1975 జూలై 24 న నాగర్‌కోయిల్‌లో జన్మించిన ఆయన 2005లో “సుక్రన్” అనే సినిమాతో సంగీత దర్శకుడిగా తమిళ చిత్ర సీమలోకి అడుగు పెట్టాడు. విజయ్ ఆంటోని 2012లో “నాన్” అనే తమిళ సినిమాతో కథానాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తమిళ చిత్ర పరిశ్రమలో గత 19 ఏళ్లుగా ఉత్తమ నటుడిగా, ఉత్తమ సంగీత స్వరకర్తగా 12 ఏళ్లకు పైగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.

కూతురు ఆత్మహత్య

తన మల్టీ టాలెంట్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న విజయ్ ఆంటోని లైఫ్ లో అనుకోకుండా తీవ్ర విషాదం నెలకొంది. 2023 సెప్టెంబర్ 19న విజయ్ ఆంటోని పెద్ద కూతురు తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. విజయ్ కూతురు డిప్రెషన్ తోనే చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ అనుకోని పరిణామానికి కుంగిపోయిన విజయ్ ఆంటోనికి ఎంతోమంది స్టార్స్ సపోర్ట్ గా నిలిచారు.

ఇప్పుడు చెప్పులు లేకుండా..

కూతురు ఆత్మహత్య బాధ నుంచి కోలుకుని మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించారు విజయ్ ఆంటోని. కానీ తన కూతురు చనిపోయాక ఆయన షూస్/చెప్పులు వేసుకోకుండానే ఎన్నో పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు