Vijay Car Collection : దళపతి గ్యారేజ్ లో ఉన్న కార్ల కలెక్షన్… మొత్తం ఆస్తులు ఎంతో తెలుసా?

Vijay Car Collection : నేడు అంటే జూన్ 22న తలపతి విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినిమా రంగంలో మూడు దశాబ్దాల పాటు నటుడిగా కొనసాగిన ఈ స్టార్ హీరో ఇప్పటిదాకా ఎంత సంపాదించాడు? కార్లు అంటే విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ గ్యారేజీలో ఉన్న కార్ల కలెక్షన్ ఏంటో ఈ సందర్భంగా తెలుసుకుందాం పదండి.

కెరీర్ మొదటి నుంచి కార్ కలెక్షన్..

విజయ్‌కి చిన్నప్పటి నుంచే కార్లంటే పిచ్చి. చిన్నప్పుడు బొమ్మ కార్లు కొన్నట్టుగా సంపాదించడం మొదలు పెట్టాక తనకు ఇష్టమైన కార్లు కొనడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆయన దగ్గర BMW, మినీ కూపర్, టయోటా ఇన్నోవా, ఆడి A8 వంటి టాప్ మోడల్ కార్లు ఉన్నాయి. అయితే కెరీర్ మొదటి నుంచి విజయ్ కొన్న కార్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

విజయ్ సంపాదించడం ప్రారంభించిన తర్వాత అంటే 90లలో విజయ్ కొన్న కారు టాటా ఎస్టేట్‌. అప్పట్లో దీని ధర రూ.2.52 లక్షలు. మొదట్లో ఈ కారులోనే తలపతి తన స్నేహితులతో కలిసి చెన్నైలో ఉత్సాహంగా తిరిగాడు. దీని తరువాత పాత మోడల్ కారు ప్రీమియర్ 118 N.Eను కొన్నారు. అప్పట్లో దీని విలువ రూ.6 లక్షలు. రెమ్యూనరేషన్ పెరిగే కొద్దీ విజయ్ కొన్న కార్ల రేటు కూడా పెరిగింది. విజయ్‌కి ఇష్టమైన కార్లలో ఒకటి 1990లలో ప్రజాదరణ పొందిన టయోటా సెరా. దీని ధర రూ.15 లక్షలు ఉంటుంది. విజయ్ కార్ల కలెక్షన్ లో టయోటా ఇన్నోవా క్రిస్టా కూడా ఉంది. దాని ధర రూ.20 లక్షల నుంచి రూ.26.05 లక్షలు.

- Advertisement -

Thalapathy Vijay net worth: Movie fee, properties & other luxury assets

ఆ తరువాత వరుసగా ఎన్నో లగ్జరీ కార్లు కొన్నాడు. విజయ్ కొన్న అత్యంత కాస్ట్లీ కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫాంటమ్ ఒకటి. ఈ కారు ధర దాదాపు రూ.8. 99 కోట్లు. రూ.1.58 కోట్ల విలువైన ఆడి ఏ8 ఎల్ కారు, తన భార్య సంగీత కోసం విజయ్ ప్రత్యేకంగా కొన్న రూ.1.04 కోట్ల లగ్జరీ కారు బీఎండబ్ల్యూ ఎక్స్6, నిస్సాన్ ఎక్స్-ట్రాయ్, 89 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ GLA, రూ.52 లక్షల మినీ కూపర్ ఎస్ వంటి కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి. అయితే మొత్తం విజయ్ దగ్గర 19 కార్లు ఉన్నాయని తెలుస్తోంది. కెరీర్ మొదట్లో కొన్న కొన్ని కార్లు మాత్రం ఇప్పుడు ఆయన దగ్గర లేవని సమాచారం.

వందల కోట్ల ఆస్తులు

భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో విజయ్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన రెమ్యూనరేషన్ 200 కోట్లు. విజయ్ ఆస్తులు 420 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. విజయ్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా పలు కంపెనీల యాడ్స్ లో నటిస్తూ సంపాదిస్తున్నాడు. కేవలం ప్రకటనల ద్వారానే విజయ్ ఏటా రూ.10 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా. కోకాకోలా, చెన్నై సూపర్ కింగ్స్ మొదలైన వాటికి విజయ్ అంబాసిడర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు