Yogibabu Remuneration : స్టార్ కమెడియన్ యోగిబాబు ఒక్కరోజుకు ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తాడంటే?

Yogibabu Remuneration : తమిళ చిత్రసీమలో ఉన్న ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు తన పారితోషికాన్ని పెంచినట్లు సమాచారం. మరి ఇంతకీ ఆయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఎంత డిమాండ్ చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే..

యోగి బాబుకు పెరిగిన డిమాండ్

తమిళ చిత్రసీమలో హీరోయిన్ లేకుండానే సినిమాలు వస్తున్నాయి. కానీ యోగి బాబు లేని సినిమా లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. స్టార్ హీరోల రేంజ్ లో బిజీగా ఉన్న యోగీబాబు వరుసగా సినిమాలలో నటిస్తూనే ఉన్నాడు. ఆయనకున్న క్రేజ్ తో పాటు కోలీవుడ్‌లో కమెడియన్ల కొరతే ఇందుకు కారణం అంటున్నారు సినీ విశ్లేషకులు. అంటే కోలీవుడ్ కు ఇప్పుసు స్టార్ హీరోలే కాదు కమేడియన్లు కూడా కరువయ్యారు అన్నమాట.

ఒక్క రోజుకే లక్షల్లో యోగి బాబు సంపాదన

యోగి బాబు బిజీ కమెడియన్ గా మారక ఆయన రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో పెరిగింది. ప్రస్తుతం ఆయన రోజుకు రూ.12 లక్షలు సంపాదిస్తున్నట్లు ఓ ప్రముఖ సినీ జర్నలిస్టు తెలిపారు. దీంతో పారితోషికం విషయంలో యోగి బాబు ఒకప్పటి టాప్ కమెడియన్ వడివేలును దాటి పోయాడని అంటున్నారు. మీడియా కథనాల ప్రకారం వడివేలు రోజుకు రూ.10 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారని, కానీ ప్రస్తుతం యోగిబాబు మాత్రం రోజుకు రూ.12 లక్షలు డిమాండ్ చేస్తున్నారని సమాచారం.

- Advertisement -

Comedian Yogi Babu to be seen as hero in new film?

కమెడియన్లు అంతా హీరోలుగా

నిన్న మొన్నటి దాకా కోలీవుడ్ లో కమెడియన్ల సంఖ్య బాగానే ఉండేది. కానీ ఇప్పుడు కమెడియన్లు కూడా హీరోలుగా నిరూపించుకునే ప్రయత్నంలో అటువైపే అడుగులు వేస్తున్నారు. అందుకే ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ల కొరత గట్టిగానే ఏర్పడింది. అదే యోగిబాబుకు ఇప్పుడు ప్లస్ పాయింట్ అయ్యింది. ప్రముఖ కమెడియన్ సంతానం హీరోగా మారిన తర్వాత యోగిబాబుకు పోటీగా సూరి, సతీష్ వంటి హాస్య నటులు వచ్చారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు హీరోలయ్యారు.

కమెడియన్ కంటే హీరోగానే ఆదరణ

అందులో నటుడు సూరి కమెడియన్‌గా కంటే హీరోగానే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాడు. అతని కెరీర్ ఈ రేంజ్ లో పీక్స్ కు చేరుకోవడానికి వెట్రిమారన్ కారణం. ఆయన దర్శకత్వం వహించిన విఠుత్య సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన సూరి ఆ తర్వాత గరుడన్, కొటుక్కలి సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. సూరి ఫుల్ టైమ్ హీరోగా మారడంతో ఇకపై హాస్య పాత్రలు చేసే ఛాన్స్ లేదని అంటున్నారు.

వడివేలుకు అడుగులు కూడా అటువైపే

మరోవైపు వడివేలు తన రీ ఎంట్రీ తర్వాత కామెడీ పాత్రల కంటే క్యారెక్టర్ రోల్స్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఆ విధంగా యోగి బాబు ఒక్కడే కమెడియన్ అనే స్థితిలో కోలీవుడ్ ఉంది. అతను ఇప్పుడు ఎంత బిజీ అంటే నిలబడే సమయం లేదని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా యోగి బాబు డిమాండ్ మేరకు తన రెమ్యూనరేషన్ ను కూడా పెంచారని కోలీవుడ్ మీడియాలో వార్తలు విన్పిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు