SDT18 : సినిమా కోసం ఏకంగా 13 డిఫరెంట్ సెట్స్ అట… మాములు ప్లానింగ్ కాదు..!

SDT18 : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా కాంపౌండ్ నుండి వచ్చినా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు. రిపబ్లిక్ తర్వాత గ్యాప్ తీసుకున్న సాయి లాస్ట్ ఇయర్ విరూపాక్ష తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇక ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేసాడు. ఇప్పుడు దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని కొత్త సినిమా స్టార్ట్ చేసాడు. ఆ మధ్య మొదలు పెట్టిన గంజా శంకర్ పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు కొత్తగా పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు సాయి దుర్గా తేజ్. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి.

13 different sets for the movie SDT18 starring Sai Durga Tej

ఏకంగా 125 కోట్ల బడ్జెట్ తో సినిమా..

సాయి దుర్గా తేజ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ (SDT18)ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మించబోతున్నారు. వీరు ఈ ఇయర్ ఆల్రెడీ హనుమాన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. సాయి దుర్గా తేజ్ 18వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తుండగా, ఇంకా టైటిల్ పెట్టని ఈ మూవీతో రోహిత్ కెపీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆ మధ్య ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ పోస్టర్ లో ఎడారి లాంటి భూమిలో ఒక పచ్చని చెట్టు ఉండడం, అలాగే దాని చుట్టూ ల్యాండ్ మైన్‌లు పేర్చి ఉన్న దృశ్యం అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఇక ఈ సినిమా ఒక వార్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని సమాచారం.పైగా ఈ సినిమాను ఏకంగా 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది.

- Advertisement -

సినిమా కోసం 13 సెట్లు…

ఇక సాయి దుర్గా తేజ్ నటిస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 13 డిఫరెంట్ సెట్స్ ని నిర్మించబోతున్నారట. ఆ పదమూడు కూడా దేనికవే డిఫరెంట్ గా ఉంటాయట. ఆ సెట్స్ అన్ని ఆడియన్స్ కి డిఫరెంట్ ఫీల్ ని కలుగచేసేవిధంగా ఐ ఫీస్ట్ ఇచ్చేలా ఉంటాయట. మరి 125 కోట్ల బడ్జెట్ అంటే ఏమాత్రం ఉంటుందిలే. కానీ సాయి మార్కెట్ పరంగా చూస్తే మాత్రం ఇది ఎక్కువే అని చెప్పాలి. కానీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి, క్వాలిటీ ఆ రేంజ్ లో వస్తే పర్లేదు. ఇక తొలి షెడ్యూల్ అల్రెడీ మొదలయిందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇంకా టైటిల్ నిశ్చయించని ఈ సినిమాను 2025 ఆగష్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు