14 Years For Golimar: పూరి జగన్నాథ్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టిన సినిమా

14 Years For Golimar: బద్రి సినిమాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు పూరి జగన్నాథ్. ఒక క్యారెక్టర్ రాయటంలో పూరీని మించిన వారు లేరు అని చెప్పొచ్చు. బద్రి సినిమా తర్వాత చేసిన బాచి సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత చిన్న కాన్సెప్ట్ సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు పూరీ జగన్నాథ్. కానీ స్టార్ డైరెక్టర్గా ఎదిగిన తర్వాత చిన్న కాన్సెప్ట్ సినిమాలు చేయడం మానేశాడు.

పోకిరి సినిమాతో సక్సెస్ ట్రాక్

వరుసగా హిట్ సినిమాలు చేస్తున్న తరుణంలో పూరి జగన్నాథ్ కి ఆంధ్ర వాళ్ళ సినిమాతో మళ్లీ డిజాస్టర్ వచ్చింది ఆ తర్వాత చేసిన 143 సూపర్ సినిమాలు అంతంత మాత్రమే అడగాలి. మహేష్ బాబు హీరోగా 2006లో రిలీజ్ అయిన పోకిరి సినిమా ఒక సంచలనం సృష్టించింది. పోకిరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదటి పోకిరి సినిమాకి ఉత్తం సింగ్ అనే టైటిల్ను అనుకున్నారు. హీరోగా రవితేజను కూడా ఖరారు చేశారు. అయితే అప్పట్లో రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే సినిమా బిజీలో ఉండి ఈ సినిమాను చేయలేకపోయాడు. ఇకపోతే పోకిరి సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు పూరి.

Director Puri Jagannadh
వరుస యావరేజ్ లు

పోకిరి సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా దేశముదురు అనే సినిమాను చేశాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా చిరుత సినిమాను చేసి మంచి హిట్ అందుకున్నాడు. చిరుత సినిమా తర్వాత వచ్చిన నేనింతే, బంపర్ ఆఫర్, ఏక్ నిరంజన్ సినిమాలో అంతంత మాత్రమే ఆడాయి. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా గోలీమార్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది. మంచి కలెక్షన్స్ ని కూడా వసూలు చేసింది అయితే ఈ సినిమా పోకిరి లా ఉంది అంటూ కొంతమంది విమర్శలు కూడా చేశారు.

- Advertisement -

గోలీమార్ తో హిట్ మార్

గోపీచంద్ కెరియర్లో వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో గోలీమార్ సినిమా ఒకటి. ఈ సినిమాలో గంగారం అనే పాత్రలో కనిపిస్తాడు గోపీచంద్. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా గోపీచంద్ ఈ సినిమాలో నటించిన తీరు అద్భుతం. గోపీచంద్ కి జంటగా ప్రియమణి ఈ సినిమాలో కనిపించింది. ప్రియమణి మదర్ పాత్రలో సీనియర్ హీరోయిన్ రోజా ఈ సినిమాలో కనిపించారు. చక్రి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి మంచి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత మళ్లీ పూరి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి బాలీవుడ్ లో బుద్ధ హోగా తెర బాప్ అనే సినిమాను చేశాడు. నేటికీ గోలీమార్ సినిమా వచ్చి 14 ఏళ్లయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు