14 Years For Singam: సూర్య 25వ సినిమాతో సంచలనం సృష్టించి నేటికీ 14 ఏళ్ళు

14 Years For Singam: తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకులలో హరి ఒకరు. తమిళ్ అనే సినిమాతో 2002లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత విక్రమ్ హీరోగా చేసిన సామి సినిమాతో కూడా మంచి గుర్తింపును సాధించుకున్నాడు. సామి సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది మంచి కలెక్షన్స్ను వసూలు చేసింది ఎన్నో భాషల్లో ఇదే సినిమా రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమాను లక్ష్మీ నరసింహ పేరుతో చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది బాలకృష్ణ అసిన్ నటించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది.

నయనతారను కూడా పరిచయం చేశారు

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో నయనతార ఒకరు. నయనతార కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీలో కెరియర్ మొదలుపెట్టిన నయనతారను అయ్యా అనే సినిమా ద్వారా తమిళ సినిమాకు పరిచయం చేశాడు హరి. ప్రస్తుతం నయనతార క్రేజ్ వేరే రేంజ్ లో ఉంది అని చెప్పాలి. లేడీ ఓరియంటెడ్ సినిమాలు నయనతార కెరియర్ లో మంచి ఇమేజ్ను తీసుకొచ్చి పెట్టాయి. అయ్యా సినిమా తర్వాత మొదటిసారి సూర్యతో ఆరు అనే సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అయింది.

సూర్యతో మూడో సినిమా

ప్రతి దర్శకుడు కూడా ఒక హీరోను ఇష్టపడితే మళ్లీమళ్లీ అతనితో పని చేయాలని అనుకుంటారు అలా సూర్యతో తన మూడవ సినిమాను సెట్ చేసుకున్నాడు హరి. హరి దర్శకత్వం వహించిన మూడవ సినిమా సింగం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి ఆ ఏడాది మొత్తంలో హైయెస్ట్ కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఈ సినిమా అనేక భాషల్లో రిలీజ్ అయింది. హిందీలో సింగం, కన్నడలో కెంపెగౌడ, బెంగాలీలో షోత్రు పేరుతో ఈ సినిమాను రీమేక్ చేశారు. ఇదే సినిమాను యముడు పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.

- Advertisement -

Singam

నేటికి 14 ఏళ్ళు

ఈ సినిమాలో సూర్య ని చూపించిన విధానం అద్భుతంగా ఉంటుంది. చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తాడు ఈ సినిమాలో సూర్య. సూర్యకి జంటగా అనుష్క ఈ సినిమాలో నటించారు. సూర్య కెరియర్ లో వచ్చిన 25వ సినిమా ఇది.కాకా కాకా అనే సినిమా తర్వాత రెండోసారి పోలీస్ పాత్రలో సూర్య కనిపించిన సినిమా ఇది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో కనిపించారు.  దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా వచ్చి నేటికి 14 ఏళ్ళు అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు