15 Years Of Oy: ఓయ్ అనే టైటిల్ ఇందుకే పెట్టారు

15 Years Of Oy: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఎప్పటికీ కొన్ని సినిమాలు ముందుంటాయి. అటువంటి కొన్ని సినిమాలు ఓయ్ అనే సినిమా కూడా ఒకటి. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఏ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమాలో అన్ని అంశాలు కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రస్తుత కాలంలో సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రేక్షకులు మైండ్ సెట్ మారింది కాబట్టి ఎప్పుడో ప్లాప్ చేసిన సినిమాలు కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు దీనికి మంచి ఎగ్జాంపుల్ ఆరెంజ్ సినిమా అని చెప్పొచ్చు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆరంజ్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను నిర్మించిన నిర్మాత నాగబాబు దాదాపు సూసైడ్ చేసుకొని స్థాయికి వెళ్లిపోయారు.

Oy Telugu Movie

- Advertisement -

లేకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన ఓయ్ సినిమాకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లేకపోతే ఓయ్ సినిమా విషయానికి వస్తే సినిమాలు చాలా అద్భుతమైన విషయాలను పొందుపరిచాడు దర్శకుడు. ఈ సినిమాలో సిద్ధార్థ క్యారెక్టర్ పేరు ఉదయ్ అని పెట్టాడు. అలానే హీరోయిన్ పేరు సంధ్య అని పెట్టాడు. ఇకపోతే ఉదయానికి ఆపోజిట్ సాయంత్రం కాబట్టి హీరోయిన్ కి సంధ్య అని పేరుని పెట్టాడు. ఇకపోతే ఈ సినిమా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో మొదలవుతుంది. ఆ తర్వాత న్యూ ఇయర్ కి ఈ లవ్ స్టోరీ ఎండ్ అవుతుంది. సరిగ్గా ఉదయ్ సంధ్య మధ్య లవ్ స్టోరీ కరెక్ట్ గా వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది అందుకే ఈ సినిమాకి వన్ లోని ఇయర్లోనే వై తీసుకొచ్చి ఓయ్ అనే టైటిల్ ని పెట్టాడు. నేటికీ ఈ క్లాసిక్ లవ్ స్టోరీ వచ్చి 15 ఏళ్లయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు