15YearsForJosh: బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా, ఎందుకో పోయిందో తెలియదు

15YearsForJosh: కొన్నిసార్లు ఎన్నో అంచనాల మీద వచ్చిన సినిమాలు ఫెయిల్ అవ్వడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. స్టార్ హీరో కొడుకు తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున తనయుడుగా జోష్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య(Naga Chaitanya). ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి రిలీజ్ అయిన టైం, అప్పుడు ఉన్న పరిస్థితులు కారణాలు కావచ్చు. అయితే ఈ సినిమా సక్సెస్ కాలేదు కానీ ఈ సినిమాకి కొంతమంది సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పాలి.

ఈ సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్ ని వాసు వర్మ డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ ఫిలిం. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన మెసేజ్ కూడా ఈ సినిమా ద్వారా చెప్పాలి అనుకున్నాడు వాసు వర్మ. ఈ సినిమాలో వాసు వర్మ రాసిన డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అలానే ఆ డైలాగ్స్ నాగచైతన్య చెప్పిన విధానం కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సందీప్ చౌతా అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. మొదట ఈ సినిమాను రామ్ చరణ్ తో చేయాలని ప్లాన్ చేశారు కానీ అప్పుడున్న కొన్ని పరిస్థితుల వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు దీంతో నాగచైతన్య ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.

Josh

- Advertisement -

ఈ సినిమాలో అన్నిటికంటే విపరీతంగా ఆకట్టుకునేవి ఈ సినిమా డైలాగ్స్

Teacher With Student:
కనీసం మేమైనా పాఠం చెప్పి పరీక్ష పెడతాం,
కానీ లైఫ్ అలా కాదు
పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది,
గుణపాఠం.

Friends With Satya:
ఇక్కడే Happy గా ఉండొచ్చు కదరా
ఇక్కడే ఉండమంటవా,Happy గా ఉండమంటవా.?

Satya at Harsha House
Life లో జాగ్రత్తగా ఉండాలి
But లైఫ్ లేకుండా చేసుకోకూడదు.

Satya At Hospital:
ఆ క్షమాపణ నేను భరించలేకపోయాను
అదే నాకు పెద్ద శిక్ష అయిపోయింది
నేను తట్టుకోలేకపోయాను.

Parents ప్రేమించడం తప్ప ఇంకేమి చేయలేరు,
Society కూడా ఏమి చేయలేదు భరించడం తప్ప.

ఇలా ప్రతి డైలాగులను ఒక లోతైన అర్థం ఉంటుంది. రాసినవి మామూలు మాటలే అయినా కూడా ఇవన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకుంటాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫెయిల్ అవ్వచ్చు కానీ ఎప్పటికీ ఈ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ ఉంటుంది.నేటికీ ఈ సినిమాకి 15 ఏళ్ళు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు