18 Pages: లెక్కల మాస్టారు చిక్కుల కథ

18 పేజెస్ ఈ సినిమా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు,
సినిమా అనౌన్స్ చేసినప్పటినుండి ఈ కాంబినేషన్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు ఈ కథను అందించింది సుకుమార్ కావడం, ఆయన పుష్ప సినిమాతో హిట్ అందుకోవడం. అదే విధంగా నిఖిల్ మరియు అనుపమ నటించిన కార్తికేయ -2 పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవ్వడం వలన, రీసెంట్ టైమ్స్ లో ఈ సినిమాపై బజ్ మరింత పెరిగింది.

తాజాగా ఈ చిత్ర ప్రొమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఒక అప్డేట్ తర్వాత మరో అప్డేట్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమా టీజర్ , అలానే నన్నయ్య రాసిన, టైం ఇవ్వు పిల్ల , ఏడు రంగుల వాన వంటి పాటలు వరుస హిట్ అయి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. కానీ ఇదంతా ట్రైలర్ ముందువరకు. ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత ఈ సినిమాపై అందరికి మస్కతి పెరిగింది.

ఏదైనా జరిగితే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయే కాలంలో ఉన్నాం మనం. కానీ ఈ సినిమాలో నందిని పాత్రలో కనిపిస్తున్న అనుపమ కి ఫేస్బుక్ అంటే తెలియదు, అసలు ఫోన్ వాడుతుందో లేదో తెలియదు. కానీ తన భావాలను, అనుభవాలను మాత్రం తన డైరీలో రాస్తుంది. ఉదాహారణకు అప్పుడే హైదరాబాద్ కి వచ్చిన నందిని
హైదరాబాద్ Early Morning రైల్వే స్టేషన్ లో వస్తున్న Announcement నాకు Welcome చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. నాకు తోడుగా ఉండి సేఫ్ గా హైదరాబాద్ కి చేర్చిన నా friend train కి thanks చెప్పాలని ఉంది.
అని తన డైరీలో రాసుకుంటుంది, ఇది మనం టీజర్ ఎండింగ్ కంప్లీట్ స్లో మోషన్ లో పెట్టి చూస్తే గమనించవచ్చు.

- Advertisement -

ఇక ట్రైలర్ విషయానికి వస్తే సిద్దార్థ్ పాత్రలో కనిపిస్తున్న నిఖిల్ కి ఒక హఠాత్ పరిణామంలో ఒక డైరీ దొరకడం. దానిని సిద్దార్థ్ చదవడం ఆ డైరీలోని నందిని భావాలు, అభిప్రాయాలు సిద్దార్థ్ ను ఆకట్టుకోవడం మనం గమనించవచ్చు. ట్రైలర్ లో “రెండు ప్రపంచాలు కలిసినప్పుడు” అని చూపించడం. కానీ టీజర్ మరియు ట్రైలర్ లో వీరి ఇరువురు ఒక చోట కనిపించకపోవడం ఆశ్చర్యం.ఈ సినిమా టైం ట్రావెల్ సినిమానా అనే ఆలోచన కూడా మొదలవుతుంది.

ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన పాటలన్ని సినిమాపై మంచి అంచనాలను పెంచితే ట్రైలర్ మాత్రం ఆసక్తిని పెంచింది. అసలు కథేంటి అనే క్యూరియాసిటీ ను క్రియేట్ చేస్తుంది ఈ 18 పేజెస్. ఇది ఒక వీడని లెక్క అనేట్లు ఈ కథను రచించాడు లెక్కల మాస్టర్ సుకుమార్. దీనికి తోడు ఈ సినిమా టీం కూడా కూడా ఇది ఒక డిఫెరెంట్ లవ్ స్టోరీ అని చెప్పుకొస్తుంది. ఈ డిఫెరెంట్ లవ్ స్టోరీ ఎంతవరకు ఆకట్టుకుంటుంది.? మన ఆలోచనలకు అందని అసలు కథేంటి అనేది డిసెంబర్ 23న తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు