2 Years Of Vikram: కమల్ హాసన్ సంచలనానికి రెండేళ్లు

2 Years Of Vikram: కమల్ హాసన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లాడు నుంచి దాదాపు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ పేరుతో పరిచయం ఉంది. తన కెరియర్ లో ఎన్నో సంచలనాత్మకమైన సినిమాలను చేశారు కమలహాసన్. కేవలం నటుడుగానే కాకుండా రచయితగా,దర్శకుడిగా,సింగర్ గా తనను తాను ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను అందించారు. కమలహాసన్ ను మించిన గొప్ప నటుడు లేరు అంటూ చాలామంది చెబుతూ ఉంటారు. చాలా సినిమాలతో ఇది ప్రూవ్ అవుతూ కూడా వచ్చింది.

విక్రమ్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్

ఇకపోతే తెలుగులో కమల్ హాసన్ సినిమాల ప్రస్తావని తీసుకొస్తే విశ్వనాథ్ దర్శకత్వంలో చేసిన చాలా సినిమాలు కమల్ హాసన్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. తన నటనతో నవ్వించటం, ఏడిపించటం ఇవన్నీ కూడా అలవోకగా చేయగల సామర్థ్యం ఉన్న నటులు కమలహాసన్. ఇకపోతే దాదాపు కమలహాసన్ సినిమా కెరియర్ అయిపోయింది అనుకున్న తరుణంలో లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ అయింది. ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కేవలం కమల్ హాసన్ కి మాత్రమే కాకుండా లోకేష్ కి కూడా ఆ సినిమా విపరీతమైన స్టార్ డం తీసుకొచ్చి పెట్టింది.

2 Years Of Vikram

- Advertisement -

తెలుగులో మొదటి సినిమాటిక్ యూనివర్స్

మామూలుగా సినీమెటిక్ యూనివర్స్ అనేది హాలీవుడ్ సినిమాల్లో మనం చూసాం. అయితే ఎవరికీ అంత చిక్కిన విధంగా దానిని తెలుగు సినిమాకి పరిచయం చేశాడు లోకేష్ కనకరాజ్. విక్రమ్ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉండేవి. అయితే విక్రమ్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనుకున్న తరుణంలో ముందురోజు రాత్రి ఒకసారి ఖైదీ సినిమా చూసి రండి అంటూ లోకేష్ చెప్పడం చాలామందికి ఆశ్చర్యం అనిపించింది. తీరా థియేటర్ కి వెళ్లి చూసేసరికి ఆ సర్ప్రైజ్ చాలామందికి గూస్ బమ్స్ వచ్చేలా చేసింది. ఏజెంట్ విక్రముగా కమల్ నటించిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ల నిరీక్షణతో వేచి ఉన్న కమల్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు.

బ్రిలియంట్ టేకింగ్

మామూలుగా తమ అభిమాన హీరోతో ఎవరైనా హిట్ సినిమా తీయాలి అని అనుకుంటారు కానీ లోకేష్ మాత్రం బీభత్సమైన హిట్ సినిమాలు తీశాడు అని చెప్పొచ్చు. దాదాపు కమల్ పని అయిపోయింది అనుకునే తరుణంలో 500 కోట్లకు పైగా వసూలు చేసే సినిమాను చేశాడు. ఈ సినిమాకి అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాని రాసిన విధానం డిజైన్ చేసిన విధానం ఆ క్యారెక్టర్ అన్నీ కూడా అభిమానులకి చాలా కొత్తగా అనిపించాయి. ఇక్కడితో ప్రేక్షకులలో వేరే స్థాయికి ఎదిగిపోయాడు లోకేష్. మామూలుగా చాలామంది స్టార్ హీరోలకి ఉన్న క్రేజ్ లోకేష్ ఈ సినిమాతో సంపాదించడానికి చెప్పవచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సృష్టించిన ఈ సినిమాకి నేటితో సరిగ్గా రెండేళ్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు