22 Years For Indhra: ఇంద్రసేనారెడ్డి ప్రభంజనానికి 22 ఏళ్ళు, మళ్లీ అనుకున్న ఇలాంటి సినిమా చేయలేరు

22 Years For Indhra: కొన్ని సినిమాలు ఎంతటి ఘనవిజయాన్ని సాధిస్తాయో ఎవరూ ఊహించలేరు. ఎన్నో అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగులుతాయి. అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తాయి. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలలో కొన్ని మాత్రమే అంచనాలను నిలబెట్టుకుంటాయి. అలా 22 ఏళ్ళ క్రితం బీభత్సమైన అంచనాలతో వచ్చింది మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలో ప్రతి అంశం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ టైంలో ఈ సినిమా ఒక ప్రభంజనం.

ఈ సినిమాకి కథను చిన్నికృష్ణ అందించారు. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వనీ దత్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఆటిట్యూడ్, స్వాగ్, మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అద్భుతంగా డిజైన్ చేసి ప్రేక్షకులకు ఒక మాస్ కమర్షియల్ ఫిలింను అందించాడు బి.గోపాల్. ఈ సినిమాలో ప్రతి అంశం కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. వారణాసి ఎపిసోడ్స్, ప్రకాష్ రాజు చిరంజీవి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు. ముఖేష్ ఋషి చిరంజీవి మధ్య జరిగే ఇంకొన్ని సన్నివేశాలు. అలానే బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఇవన్నీ కూడా బీభత్సంగా ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.

ఇక ఈ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచింది మణిశర్మ సంగీతం. సినిమాలో ప్రతి పాట కూడా అద్భుతమైన హిట్ గా నిలిచింది. మణిశర్మ మ్యూజిక్ కి మెగాస్టార్ అందించిన స్టెప్పులుకు థియేటర్ దద్దరిల్లిపోయింది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ఇప్పటికీ హైలెట్ అని చెప్పొచ్చు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి అద్భుతమైన డైలాగ్స్ ను అందించారు. ఇప్పటికీ ఈ సినిమా లోని కొన్ని సీన్స్ మంచి హై ఫీల్ ను ఇస్తాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ను డిజైన్ చేశారు. మెగాస్టార్ డైలాగ్స్ చెప్తుంటే ఆ హై వేరు అని చెప్పొచ్చు.

- Advertisement -

Indra

ఈ సినిమాలోని చాలా డైలాగ్స్ పాపులర్ అయ్యాయి. “మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా” “తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్న లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకుని వెళ్లేవాడిని” ఇలాంటి చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాతో ఇప్పుడున్న చాలామంది 90s కిడ్స్ కి మంచి జ్ఞాపకాలు ఉండి ఉంటాయి. టీవీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసిన చాలా మంది ఈ సినిమాను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో రీ రిలీజ్ చేస్తే ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. నేటికీ ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా 22 ఏళ్లు పూర్తి చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు