#22yearsforNuvvuNaakuNachav: వెంకటేశ్వర్లు హైదరాబాద్ కు వచ్చి 22 ఏళ్ళు అయింది.

#22yearsforNuvvuNaakuNachav

సినిమా వెబ్ సైట్ లో ఈ వెంకటేశ్వర్లు ఎవరు అనుకుంటున్నారా.? అదేనండి అనకాపల్లిలో ట్రైన్ ఎక్కి,
సికంద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళిపోయాక
తరువాత నాంపల్లి వస్తుందని తెలియక
హడావిడిగా ట్రైన్ దూకేసాడు కదా ఆ వెంకటేశ్వర్లు.
పట్టాలు పట్టుకుని తిన్నగా చిక్కడపల్లికి వెళ్లడం కష్టమని
బయటకు వచ్చి ఆటో ఎక్కి 50 రూపాయలు ఇచ్చాడు కదా అదే వెంకటేశ్వర్లు. ఈ పాటికి వెంకటేశ్వర్లు మనకు గుర్తొచ్చి ఉండాలే..
అదేనండి మన వెంకీ, శేఖరం గారి అబ్బాయి.

అయినా, హైదరాబాద్ వచ్చిన వెంకటేశ్వర్లు ఇంట్లో ఫంక్షన్ అయిపోయాక కనిపిస్తాడు అనుకుంటే, దేవాలయంలో హరికథలు కోసం వెళ్లి, అవి అంత ఇంట్రస్టింగ్‌గా లేవని పక్క థియేటర్‌లో ప్రేమించుకుందంరా సినిమాకు వెళ్లిపోయాడేంటి బాబు, అయినా అందుకు కదూ మనకు ఇప్పుడు ఆ వెంకటేశ్వర్లు గుర్తుంది. ఏ ముహూర్తనో ఆ సినిమాకు “నువ్వు నాకు నచ్చావ్’ అని పేరు పెట్టారో కానీ వెంకటేశ్వర్లు ప్రతి ఒక్కడికి నచ్చుతాడు. అందుకే ఎంగేజ్మెంట్ అయిపోయినా కూడా నందు కు నచ్చాడు.

కొన్ని అద్భుతాలు అలా జరుగుతాయి. అలాంటి అద్భుతాలలో “నువ్వు నాకు నచ్చావ్” ఒకటి. ఈ సినిమాను త్రివిక్రమ్ రాసిన విధానం.. రాసిన మాటలు ఎప్పటికి బోర్ కొట్టవ్.. అలా చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నువ్వు నాకు నచ్చావ్ ఒకటి. అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందంటే.

- Advertisement -

ఒక పెద్ద హాల్ అందులో ప్రొడ్యూసర్ ‘స్రవంతి’ రవికిశోర్, డెరైక్టర్ విజయభాస్కర్ తో పాటు ఆఫీసుబాయ్ దాకా పది, పదిహేనుమంది ఉన్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్‌తో సహా కథ చెబుతున్నాడు.
కొందరు ముసిముసిగా నవ్వుతుంటే, ఇంకొందరు పగలబడి నవ్వుతున్నారు. ఈ రియాక్షన్స్ అన్నీ రవి కిశోర్ కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు.

‘శుభం’ అంటూ త్రివిక్రమ్ స్క్రిప్టు మూసేశాడు.

నువ్వు నాకు నచ్చావ్ స్క్రిప్టు తో స్రవంతి రవికిశోర్‌ ఎంత హ్యాపీ అంటే బ్రీఫ్ కేస్‌లో చెక్కు బుక్కులన్నీ తీసేసి, ఈ స్క్రిప్టే పెట్టుకుని తిరుగుతున్నాడాయన. ఖాళీ దొరికినప్పుడల్లా తనివితీరా చదువుకుంటున్నాడు. కథ మొత్తం కంఠస్థం వచ్చేసిందాయనకు. ఏ హీరోతో అయినా చేయడానికి ఆయన రెడీ. కానీ ఈ కథ ఎవరికో రాసిపెట్టే ఉండుంటుంది!
అవును… రాసిపెట్టి ఉంది… వెంకటేశ్‌కి!

త్రివిక్రమ్ వెళ్లాడు. కథ చెప్పాడు. వెంకటేశ్ ఫ్లాట్! ‘‘వాట్ ఎ లవ్ లీ క్యారెక్టైరైజేషన్’’ అనుకున్నాడు. మొత్తానికి సినిమా అంతా సెట్, షూటింగ్ డన్, రిలీజ్ కి రెడీ.

2001 సెప్టెంబర్ 6
3 గంటల 12 నిమిషాలు ఓపిక పడితే తప్ప రిజల్ట్ తెలియదు.
అవును… ఈ సినిమా నిడివి అంతే!
బయటికొచ్చిన వాళ్లంతా ‘‘సినిమా బాగుంది కానీ, లెంగ్త్ ఎక్కువైపోయింది’’ అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఖంగారు పడిపోతున్నారు. రవికిశోర్ మాత్రం చాలా కూల్ గా ఉన్నారు. ఆయనకు ఈ సినిమా రిజల్ట్ మీద పూర్తి భరోసా.

ఆ టైమ్‌లో వెంకటేశ్‌కి ది డిఫరెంట్ ఎటెంప్ట్. దానికి తోడు సినిమాలో నో ఫైట్స్. ఫ్యాన్స్‌లో కొంత డైలమా ఉంటుంది. నాలుగు రోజులు ఆగితే అంతా సెట్ అయిపోతుంది. అవతలేమో పెద్దపెద్దవాళ్లు కూడా ఫోన్లు చేసి, అరగంట సినిమా ఎడిట్ చేసేయమంటున్నారు. ముఖ్యంగా సుహాసిని ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేయమంటున్నారు.

రవికిశోర్ మాత్రం మొండిగా ఉన్నారు. ఒక్క షాట్ కూడా తీసేది లేదు. ఈ సినిమా సూపర్‌హిట్… అంతే. ఎస్… వన్ వీక్ తర్వాత రిజల్ట్ అదే! అందరూ ఈ సినిమాను ‘నువ్వు నాకు నచ్చావ్’ అనడం మొదలుపెట్టారు.

అసలు వెంకటేశ్వర్లు గురించి ప్రస్తావిస్తే..

వెంకటేశ్వర్ల – సలహా

సిగరెట్లు తాగితే బలం రాదు నాన్న, దగ్గు వస్తుంది.

వెంకటేశ్వర్లు – ప్రపంచం

ఊర్లో వ్యవసాయం చేసుకుంటే, వాళ్ళ నాన్నను స్కూటర్ ఎక్కించుకుని తిప్పగలను అనే ఉద్దేశ్యం. తన పది ఎకరాలను సరదాగా పొలం దున్నుకుని , సాయంత్రం ఒక దమ్ము కొట్టి , ఫ్రెండ్స్ తో సెకండ్ షో సినిమాకి వెళ్తే చాలు. అంతే వెంకటేశ్వర్లు ప్రపంచం.

వెంకటేశ్వర్లు – మనస్తత్వం

మనం సంతోషంగా ఉన్నప్పుడు వెన్ను తట్టేవాళ్లు, బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్లు లేనప్పుడు ఎంత సంపాదించినా వేస్ట్! అనుకునే మనస్తత్వం

వెంకటేశ్వర్లు – మనసు

నందు కాపురం బాగుండాలి గోపురానికి దండం పెట్టే మంచి మనసయ్య వెంకటేశ్వర్లుది.

పెళ్ళి గురించి వెంకటేశ్వర్లు కి తెలిసినంతగా ఎవరికీ తెలియదండి.
తాటాకులతో పందిరి వెయ్యాలి.
మావిడాకులతో తోరణాలు కట్టాలి.
అరటాకుల్లో భోజనాలు పెట్టాలి.
అది పెళ్లి అంటే…
పెళ్లి అంటే సందడి ఉండాలండి.
ఇంటి నిండా చుట్టాలు..
ఒంటి నిండా నగలు, చేతినిండా పనులు.
అంటుంటాడు.

వెంకటేశ్వర్లు – ఆఫీస్

ఒక అమ్మాయి బాగుంటుంది.

వెంకటేశ్వర్లు – హ్యాంగోవర్

పింకీ కాళ్ళు అనుకుని మంచం కోళ్లు పట్టుకోవడం.

వెంకటేశ్వర్ల – త్యాగం

ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి పందిరి వేయడం.

ఇలా రాసుకుంటూ పోతే ఒకటా, రెండా వెంకటేశ్వర్లు గురించి రాస్తే రామకోటి అవుద్ది. అప్పుడు హైదరాబాద్ వచ్చిన వెంకటేశ్వర్లు ఇప్పుడు హాట్ స్టార్ లో ఉన్నాడు. ఖాళీ చూసుకుని ఒకసారి మీ ఫ్యామిలీతో పలకరించి రండి.

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు