2Years For Major : ఇన్స్పైరింగ్ బయోపిక్ సినిమాకి రెండేళ్లు…

2Years For Major :మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా 26/11 ఎటాక్ ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన పేట్రియాటిక్ మూవీ “మేజర్”. మహేష్ బాబు ఎంటెర్టైన్మెంట్ బ్యానర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను స్వయంగా నిర్మించగా, శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. ఇక టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఈ సినిమాలో హీరోగా సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో నటించాడు. ఇక పాన్ ఇండియా మూవీగా 2022 జూన్ 3 న విడుదలయిన “మేజర్” సినిమా ఘన విజయం సాధించింది. తెలుగులో వచ్చిన దేశభక్తి సినిమాల్లో ఈ సినిమా క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇక ఈ క్లాసిక్ సినిమా వచ్చి నేటికీ (2Years For Major) రెండేళ్లు అవుతుంది. ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా సాధించిన ఈ చిత్రం అడవి శేష్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా, తన కెరీర్లోనే అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. అలాగే , ఎందరో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుని, మంత్రుల నుండి రాష్ట్రపతి దాకా ప్రశంసలు అందుకున్నారు ఈ చిత్ర యూనిట్.

2Years For Major Movie

దేశభక్తి సినిమాల్లో ఉత్తమం..

ఇక 26/11 ముంబై దాడుల నేపథ్యంలో సినిమాలు అంతకు ముందే వచ్చినా, ఈ సినిమా స్పెషల్ గా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాల్లో కేవలం ప్రమాదం జరిగిన కోణంలోనే తెరకెక్కగా, ఈ సినిమా ముంబై అటాక్ లో ఎంతో మంది ప్రాణాలు కాపాడి ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమా మహేష్ బ్బు నిర్మాణంలో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కగా, దర్శకుడు శశికిరణ్ ఈ సినిమాని చాలా బాగా తీసాడు. ఈ సినిమా క్లైమాక్స్ ఎన్ని సార్లు చూసినా రోమాలు నిక్కబొడుచుకుని ప్రతి పౌరుడిలోని దేశభక్తిని మేల్కొల్పుతుంది. ఇక ఆ రోజుల్లో ఈ సినిమా దాదాపు 70 కోట్ల వసూళ్లు అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

- Advertisement -

ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రశంసలు అందుకున్న మేజర్…

ఇక మేజర్ పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్షింపబడింది. IFFI లో కూడా ఈ సినిమా ప్రదరింపబడి ప్రశంసలు పొందింది. అలాగే మేజర్ సినిమాకు, భారత మాజీ రాష్ట్రపతి అయిన రామ్ నాథ్ కోవింద్ ఈ సినిమాను వీక్షించి స్పెషల్ గా చిత్ర యూనిట్ ని అభినందించారు. ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ, శోభిత ధూళిపాళ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇక తాజాగా మేజర్ సినిమాని గుర్తు చేసుకుంటూ అడవి శేష్ తనకి ఇంత గొప్ప సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు మహేష్ బాబు కు స్పెషల్ విషెస్ తెలియచేస్తూ, చిత్ర యూనిట్ ని ట్యాగ్ చేస్తూ విష్ చేసారు అడవి శేష్. ఇక తెలుగు లో ఇలాంటి దేశభక్తి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు