SonaliBendre : లక్ అంటే ఈ హీరోయిన్ దే! ఈ ఇయర్ హంగామా మొత్తం తనదే!

SonaliBendre : టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్ “సోనాలి బింద్రే”. తెలుగులో అప్పటి స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన హీరోయిన్ ఈమె. అయితే ఆ తర్వాత బాలీవుడ్ కే షిప్ట్ అయింది. బాలీవుడ్ లో సినిమాలు బాగానే చేసినప్పటికీ, స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ మాత్రం తెలుగులోనే వచ్చిందని చెప్పాలి. ఇక సోనాలి బింద్రే క్యాన్సర్ తర్వాత సినిమాలు ఆపేసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ నుండి కోలుకున్నాక ఇప్పుడు టీవీ షోలలో జడ్జ్ గా చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుందని చెప్పాలి. గత ఐదారు నెలలుగా పెద్దగా రీ రిలీజ్ హడావిడి లేకపోగా, తాజాగా మురారి సినిమాతో మళ్ళీ రీ రిలీజ్ సినిమాలకు ఊపొచ్చింది.

3 movies starring Sonali Bendre are getting re-released this year

ఈ ఇయర్ హంగామా సోనాలీదే..

ఇక ఈ ఇయర్ టాలీవుడ్ లో పలు క్రేజీ సినిమాల రీ రిలీజ్ హడావిడి జరుగుతుండగా, ఇప్పటికే మురారి తో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక త్వరలో చిరంజీవి ఇంద్ర (Indra), శంకర్ దాదా ఎంబిబిఎస్ నాగార్జున మాస్, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, ప్రభాస్ ఈశ్వర్ వంటి క్రేజీ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ ఇయర్ సందడి మాత్రం హీరోయిన్ సోనాలి బింద్రేది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇయర్ ఆమె నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలే రీ రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ నాగార్జున మన్మధుడు సినిమాతో రచ్చ చేసిన సోనాలిబింద్రే, ఈ ఇయర్ లేటెస్ట్ గా మురారి సినిమాతో థియేటర్లోకి వచ్చింది. ఇక త్వరలో రీ రిలీజ్ కాబోతున్న చిరంజీవి ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాల్లో కూడా సోనాలి బింద్రే హీరోయిన్ కావడం విశేషం.

- Advertisement -

సెకండ్ ఇన్నింగ్స్ మొదలెడుతుందా?

ఇక సోనాలి బింద్రే (SonaliBendre ) తెలుగులో తక్కువ సినిమాలే చేసినా, ఎక్కువగా బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయి. ఇప్పుడు రీ రిలీజ్ కాబోతున్న సినిమాల్లో కూడా సోనాలి బింద్రే మంచి రోల్స్ చేసింది. ఇక మురారి సినిమాకి స్పెషల్ గా వీడియో బిట్ ని రిలీజ్ చేసి సందడి చేసిన ఈ భామ, ఇంద్ర సినిమాకి ఏకంగా మేకర్స్ తో స్పెషల్ వీడియో చేయనుందని సమాచారం. ఇక తెలుగులో ఈమెకి రీ రిలీజ్ సినిమాల తర్వాత మంచి రోల్స్ ఆఫర్లు రావడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు. సీనియర్ హీరోయిన్స్ టబు, భూమిక లాగా తెలుగులో సోనాలి బింద్రే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యే ఛాన్స్ ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు