35CKK : టీచర్ చెప్పారు..వాయిదా వేసేసారు. కొత్త డేట్ ఎప్పుడు?

35CKK : టాలీవుడ్ లో ఈ వారం క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. పంద్రాగస్టు లాంగ్ వీకెండ్ ఉండడంతో భారీ ఎత్తున పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో మాస్ మహారాజ్ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్, అలాగే రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ తో పాటు, చియాన్ విక్రమ్ తంగలాన్ కూడా ఉంది. ఇక చిన్న సినిమాలు ఆయ్, 35 చిన్న కథ కాదు కూడా రిలీజ్ అవుతున్నాయని అనుకున్నారు. అయితే వీటిలో ఇప్పుడు ఓ సినిమా తప్పుకుంది. “35 – చిన్న కథ కాదు” సినిమా ఆగష్టు 15 నుండి తప్పుకుంటున్నట్టు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేసారు.

"35 Chinna katha kadu" movie has been postponed

టీచర్ చెప్పారు వాయిదా వేశారు..

ఇక 35 – చిన్న కథ కాదు సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌ లతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలని ఈ సినిమా క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పిస్తుండటంతో ఇండస్ట్రీలో ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేసారు. మొన్నటివరకు కూడా ప్రమోషన్లు కూడా చేసారు. కానీ, ఇప్పుడు 35 – చిన్న కథ కాదు సినిమా రిలీజ్ డేట్‌ని మార్చినట్లుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఆగస్టు 15న బాక్సాఫీస్ దగ్గర పలు సినిమాలు క్లాష్ అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ మార్పుకి సంబంధించి తాజాగా ఓ వీడియో రూపంలో అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియోలో “టీచర్ చెప్తే వినాలి.. రిలీజ్ తేది మారాలి..” అంటూ ఓ లైన్‌ను మేకర్స్ కాప్షన్ గా పెట్టారు.

- Advertisement -

కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు?

ఇక ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఈ సినిమా తప్పుకోవడమే మంచిదని ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. పెద్ద సినిమాల మధ్య దీనికి ఓపెనింగ్స్ తగ్గే అవకాశం ఉంది. అయితే కొత్త రిలీజ్ డేట్ పై చర్చ నడుస్తుంది. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ’35 – చిన్న కథ కాదు’ మూవీని టీచర్స్ డే రోజైన సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విశ్వ, ప్రియదర్శి, గౌతమి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను నందకిషోర్ ఈమని డైరెక్ట్ చేయగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని మేకర్స్ చెప్పడం జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు