35ChinnaKathaKaadu Trailer : మనందరి ఇంట్లో కథే.. కాస్త కొత్తగా నచ్చేలా..

35ChinnaKathaKaadu Trailer : టాలీవుడ్ హల్క్ దగ్గుపాటి రానా (Rana) సమర్పణలో తెరకెక్కిన సినిమా “35చిన్న కథ కాదు” గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తుండగా, ఫైనల్ గా సెప్టెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. నివేదా థామస్ (Niveda Thamous), విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. కాసేపటికిందే రిలీజ్ అయిన ట్రైలర్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇక “35చిన్న కథ కాదు” సినిమాకు బి.నందకిషోర్ దర్శకత్వం వహించడం జరిగింది.

35Chinna Katha Kaadu Movie Trailer Talk

పిల్లలున్న అందరి ఫ్యామిలీలో సమస్యే ఈ కథ..

ఇక “35చిన్న కథ కాదు” (35Chinna KathaKaadu Trailer) ట్రైలర్ విషయానికి వస్తే… ట్రైలర్ లో నివేదా ఫ్యామిలిని చూపిస్తూ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ తో స్టార్ట్ చేస్తారు.. హీరో, హీరోయిన్ వాళ్ళకి ముగ్గురు పిల్లలు.. అన్నట్టు ఫ్యామిలీని చూపించగా చదువు విషయంలో ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థిని అంతా జీరో బాబు, సున్నా అంటూ స్కూల్ లో పిలుస్తూ, క్లాస్ లో టీచర్లు పనిష్ చేస్తూ హేళన చేస్తుంటారు. ఎలా అయినా తమ కొడుకును బాగా చదివించాలని, తల్లి దండ్రులు, అలాగే స్కూల్లో టీచర్ కూడా తాపత్రయపడుతుంటారు. ఈ క్రమంలో అందరూ చేసే హేళనను తట్టుకుని ఆ కుర్రాడు బాగా చదువుకున్నడా? ఆ పిల్లాడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. చివరకు ఏమైందనేది సినిమా కథగా ఉండబోతుందని తెలుస్తుంది.

- Advertisement -

ఫ్యామిలీస్ మెచ్చే కథతో వస్తున్నారు..

ఇక ట్రైలర్ ని మొత్తం చూడగా, ప్రతీ ఫ్యామిలీ లో ఉండే కథలే ఈ సినిమాలో చూపిస్తున్నారని తెలుస్తుంది. మిడిల్ క్లాస్ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల చదువులు, ప్రేమలు ఇవన్నీ చూపించారు. ట్రైలర్ లో “పిల్లలతో బాగా ఉండడం కాదు.. పిల్లలు బాగుపడడం” అంటూ టీచర్ ప్రియదర్శి (Priyadarshi) చెప్పే డైలాగ్ చాలా బాగుందని చెప్పాలి. డైరెక్టర్ నందకిషోర్ (Nanda kishor) స్టోరీని బాగానే హ్యాండిల్ చేసాడని అనిపిస్తుంది. ఇక నివేదా, విశ్వ ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. సినెమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఇక వివేక్ సాగర్ అందించిన బీజీఎమ్ బాగుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి సెప్టెంబర్ 6న రిలీజ్ కాబోతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు