38YearsFor KaliyugaPandavulu : 38వసంతాల “కలియుగపాండవులు”.. కృష్ణతో చేయాల్సిన సినిమా.. “వెంకటేష్” తో తీశారు..

38YearsFor KaliyugaPandavulu : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో “విక్టరీ వెంకటేష్” ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రెండో తరం అగ్ర హీరోలలో ఒకరిగా, టాలీవుడ్ లో నెగిటివీటి లేని స్టార్ హీరోగా, వివాదాలకు దూరంగా ఉండే హీరోగా వెంకటేష్ కు గుర్తింపు ఉంది. ఇండస్ట్రీకి నిర్మాత కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా, తన సినిమాలతో తన నటనతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించి, ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ నాటి కలియుగ పాండవులు నుండి నిన్నటి సైన్ధవ్ వరకు ఎన్నో రికార్డులు, రివార్డులు క్రియేట్ చేసాడు. తాజాగా వెంకటేష్ తన కెరీర్ లో 38 యేళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. అంటే తన తొలి సినిమా “కలియుగ పాండవులు” సినిమా విడుదలై నేటికీ 38 వసంతాలు (38YearsFor KaliyugaPandavulu) పూర్తి చేసుకుంది. అయితే వెంకటేష్ సినిమా ఎంట్రీ మాత్రం అనుకోని విధంగా జరిగిందని చెప్పాలి.

38Years For Venkatesh 'Kaliyuga Pandavulu' Movie

కృష్ణ చేయాల్సిన సినిమా వెంకటేష్ తో…

అయితే వెంకటేష్ (Venkatesh) తొలి సినిమా కలియుగ పాండవులు గురించి కొన్ని విషయాలు చాలామందికి తెలీదు. వెంకటేష్ అప్పటికీ యూఎస్ చదువుకుంటున్నాడు. ఇక్కడ అగ్ర నిర్మాతగా వరుస సినిమాలు తీస్తున్న రామానాయుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కొత్త సినిమా చేయడానికి రెడీ అయ్యారు. పరచూరి బ్రదర్స్ రాసిన కథ నచ్చి, రాఘవేంద్రరావు తో కలిసి సినిమా ప్లాన్ చేయగా, ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ (Krishna ని హీరోగా అనుకున్నారు. హీరోయిన్ గా రాధని అనుకున్నారు. కథ విన్న వెంటనే కృష్ణ కూడా ఒకే చేసారు. అయితే అప్పట్లో కృష్ణ ఈ సినిమాను వేరే బ్యానర్‌‌ తో కూడా సంయుక్తంగా తెరకెక్కించమని రామానాయుడుకు చెప్పారట. కానీ రామానాయుడుకు వేరే వాళ్లతో కలిసి ఈ సినిమాను తీయడం అస్సలు ఇష్టపడలేదు. అటు కృష్ణ కూడా రాజి పడలేదట. దాంతో అప్పటికప్పుడు తన కుమారుడు వెంకటేష్‌ ను హీరోగా పెట్టి తెరకెక్కించడం జరిగింది. అలా వెంకటేష్‌ సినిమాల్లోకి హీరోగా పరిచయమయ్యారు.

- Advertisement -

తొలి సినిమాతోనే విక్టరీ..

ఇక కృష్ణ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగానే, అమెరికాలో ఉన్న వెంక‌టేష్ ని పిలించి రామానాయుడు అప్పటికప్పుడు వెంక‌టేష్ ని మేకప్ వేసుకోమ‌న్నారు. హీరొయిన్ గా ఖుష్బూ ను తీసుకోగా ఆమెకు కూడా ఇదే తొలి సినిమా. పరచూరి బ్రదర్స్ వెంకటేష్ కి తగ్గట్టుగా మార్పులు చేసి, స్క్రిప్ట్ రెడీ చేయగా, కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “కలియుగ పాండవులు” సినిమా 1986 ఆగష్టు 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం విశేషం. ఇక వెంకటేష్ తన మొదటి సినిమాలోనే తన నటనకు గాను ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకోవడం విశేషం. అలా తన తొలి సినిమా నుండే విక్టరీ సాధించిన వెంకటేష్ అగ్ర హీరోగా ఎదిగి, ఇండస్ట్రీ లో విక్టరీ వెంకటేష్ గా ఎదిగాడు. నేటికి కలియుగ పాండవులు సినిమా విడుదలై 38 యేళ్లు పూర్తి కాగా, వెంకటేష్ తన ముప్పయ్ ఎనిమిదేళ్ల ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని, ఇప్పటికీ అదే ఎనర్జీతో సినిమాలు చేస్తూ యంగ్ స్టార్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు