Tollywood : ఒక్క రోజు గ్యాప్ లో మూడు క్రేజీ సినిమాల ఓపెనింగ్…

Tollywood : టాలీవుడ్ లో ఈ ఇయర్ ఆరు నెలలు చూస్తూనే గడచిపోయాయి. కానీ సరైన సినిమాలు మాత్రం ఈ ఏడాది అంతగా రాలేదని చెప్పాలి. ఈ ఇయర్ సక్సెస్ సాధించిన సినిమాల గురించి మాట్లాడితే చాలా తక్కువేనని చెప్పాలి. సంక్రాంతికి వచ్చిన హనుమాన్, టిల్లు స్క్వేర్, లేటెస్ట్ గా కల్కి2898AD. వీటి మధ్యలో ఓ రెండు మూడు చిన్న సినిమాలు మినహా ఒక్కటీ బ్రేక్ ఈవెన్ కాలేదని చెప్పాలి. ఇక ముఖ్యంగా సమ్మర్ లో సినిమాలు లేక థియేటర్లు బోసిపోయాయని చెప్పాలి. కానీ ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో మాత్రం వరుస సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పెద్ద సినిమాలు మొదలుకొని, మీడియం రేంజ్, చిన్న సినిమాలు కూడా క్యూ కడుతున్నాయి. ఇక థియేటర్లలో సినిమాలు రావడమే కాదు, జులై 1 నుండి వరుస సినిమాలు ఓపెనింగ్ జరుపుకోనున్నాయి. అలాగే కొన్ని సినిమాలు వెంటనే రెగ్యులర్ షూట్ కూడా జరుపుకోనునున్నాయి.

4 movies opening ceremony in first week of July in Tollywood

ఒక్క రోజు గ్యాప్ లో మూడు సినిమాల ఓపెనింగ్…

ఇక టాలీవుడ్ (Tollywood) లో జులై1 మొదలుకొని 3వ తారీఖు వరకు ఏకంగా నాలుగు సినిమాల ప్రారంభోత్సవం జరుగనున్నాయి. జులై 1న నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ది ఇండియా హౌస్ సినిమా ని ప్రారంభించనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాని వి మెగా పిక్చర్స్ బ్యానర్ లో రామ్ వంశి తో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జులై 2న బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాహు గారపాటి నిర్మాణంలో కౌశిక్ దర్శకత్వంలో తన 11వ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. అలాగే జులై 3న విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో సాహూ గారపాటి నిర్మాణంలోనే మరో సినిమా ఓపెనింగ్ జరుపుకోనుంది.

- Advertisement -

వెంకీ సినిమా 3న ఓపెనింగ్…

ఇక వీటన్నిటిని మించి వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ సినిమా Venky76 ను జులై 3న ప్రారంభించనున్నారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న వెంటనే వారం తిరక్కుండానే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారట. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ని ఈ సినిమాని ఖరారు చేయగా, వచ్చే సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ఇక టాలీవుడ్ లో ఇలా రెండు రోజుల తేడాతో నాలుగు క్రేజీ సినిమాల ఓపెనింగ్ జరుగనుండడం చాలా ఆసక్తిగా ఉందని చెప్పాలి. ఇక ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు ఏవి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ జులై12న థియేటర్లలో భారతీయుడు2 మూవీ రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు