44 years for Mosagadu : 44 వసంతాల “మోసగాడు”..ప్రతినాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం…

44 years for Mosagadu : టాలీవుడ్ లో లెజెండరీ నటులు గా చెప్పుకుంటున్న కొంతమంది స్టార్ హీరోలు కెరీర్ బిగినింగ్ లో అన్ని రకాల పాత్రలు చేసేవారు. అంతే కాదు అవసరమైతే ప్రతినాయక పాత్రలు అయినా చేసేవారు. అలా కెరీర్ బిగినింగ్ లో ప్రతినాయక పాత్రలు చేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి నట ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, ఆ పైన సైడ్ రోల్స్ లో, ప్రతినాయక పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. అలా కెరీర్ బిగినింగ్ లో నటించిన “మోసగాడు” చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. శోభన్ బాబు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ఇది. అప్పటికే వీరి కాంబినేషన్ లో బాబు, రాజా, రాధాకృష్ణ వంటి సినిమాలొచ్చాయి. ఇక శ్రీదేవి ఇందులో హీరోయిన్ గా నటించగా, తొలిసారిగా ద్విపాత్రాభినయంచేసింది చేసింది. ఇక అప్పుడప్పుడే హీరోగా రాణిస్తున్న చిరంజీవి ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. పేరుకి ప్రతినాయక పాత్రే అయినా సినిమాకి ఎంతో కీలకమైన పాత్ర. ఇక ఈ చిత్రం విడుదలై నేటికీ (మే 22 1980) 44 వసంతాలు పూర్తి చేసుకుంది.

44 years for Mosagadu Movie

ఇక సినిమా కథ విషయానికి వస్తే…

ఈ చిత్రంలో ఒకరినొకరు ప్రేమించుకున్న శోభన్ బాబు మరియు శ్రీదేవి త్వరలో పెళ్లి చేసుకోబోతుంటారు. ఇక చిరు వారి ప్రాంతంలో ఒక స్థానిక రౌడీషీటర్. అతను శ్రీదేవి యొక్క కవల సోదరి (మరో శ్రీదేవి) తో సంబంధం కలిగి ఉంటాడు. శ్రీదేవి తన కవల సోదరి జీవన శైలికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. కానీ, చిరు శ్రీదేవి అక్కపై కూడా కన్నేశాడు. కానీ కొన్ని సార్లు శోభన్ చేత కొట్టబడ్డాడు. ఈ క్రమంలో అతను వారిపై వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఒకరోజు శోభన్ మరియు శ్రీదేవి ఒక గుడిలో పెళ్లి చేసుకోబోతున్నప్పుడు, చిరు ఆమెను ఒంటరిగా శోభన్ కోసం ఎదురు చూస్తున్నట్లు గుర్తించి, అతను ఆమెపై అత్యాచారం చేస్తాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక, ఆమె ఆత్మహత్య చేసుకుంది. మరియు ఆమె చనిపోయే ముందు, శోభన్ అక్కడికి చేరుకోగా, అతనిపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. చివరికి, శోభన్ చిరుని చంపి మరణశిక్ష విధించబడతాడు. ఆ తర్వాత శోభన్ శ్రీదేవిని స్వర్గంలో కలుసుకున్నట్లు చూపించి ఎండ్ చేస్తారు.

- Advertisement -

సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో విజయవంతమైన చిత్రం…

ఇక కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శోభన్ బాబు కిది నాలుగో చిత్రం కాగా ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఇక చిరంజీవి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తొలిసారిగా నటించగా, ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో ఏకంగా 13 సినిమాలు వచ్చాయి. ఇక శ్రీదేవి కూడా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. అలాగే చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది. ఈ సినిమా తర్వాత రాణి కాసుల రంగమ్మ చిత్రంలో హీరోహీరోయిన్లు గా నటించారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత జగదేకవీరుడు అతిలోక సుందరి, SP పరశురామ్ చిత్రాలు వచ్చాయి. ఇక మోసగాడు సినిమా క్రాంతి కుమార్ నిర్మించిన మోసగాడు (44 years for Mosagadu) చిత్రం ఆ రోజుల్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా మంచి విజయం సాధించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు