46Years for Dongala Dopidi :కృష్ణ “దొంగల దోపిడీ” కి 46 ఏళ్లు.. ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డులకు నాంది పలిందిక్కేడే..!

46Years for Dongala Dopidi : సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన నట శేఖర కృష్ణ, తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ డాషింగ్ హీరోగా అప్పట్లో ప్రసిద్ధి చెందారు. తెలుగు చిత్ర పరిశ్రమని కమర్షియల్ గా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం వంటి భారీ చిత్రాలతో తెలుగు సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఇక నట శేఖర కృష్ణ ఒక్క నటనలోనే కాకుండా, దర్శకుడిగా, నిర్మాత గా, కథా రచయిత గా ఇలా ఎన్నో విభాగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి గా రాణించారు. ఇక అప్పట్లో అల్లూరి సీతారామరాజు తో తొలి 70MM సినిమాని అందించగా, మోసగాళ్లకు మోసగాడు తో ఇండియా లో కౌ బాయ్ సినిమాను, అలాగే గూఢచారి116 తో గూడచారి నేపథ్యమున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇక సింహాసనం సినిమాతో తొలి స్టీరియో స్కోప్ చిత్రాన్ని అందించి అప్పట్లోనే సంచలనం సృష్టించారు. ఇలా తన సినిమాలతో తెలుగు సినిమాలని ఎన్నో విధాలుగా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేసారు కృష్ణ. అంతే కాదు ఎన్నో బాక్స్ ఆఫీస్ రికార్డులకు రారాజు గా కృష్ణ నిలిచారు. అలా కృష్ణ నటించిన చిత్రాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది “దొంగల దోపిడీ” చిత్రం. ఈ సినిమా విడుదలై నేటికీ 46 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం..

రాజుల సంస్థాన నేపథ్యంలో దొంగల దోపిడీ..

కృష్ణ హీరోగా నటించిన “దొంగల దోపిడీ” సినిమాను నిర్మాత యు.సూర్యనారాయణబాబు నిర్మించగా, 1978 మే 12న సినిమా విడుదలైంది. కృష్ణ తో పాటు, మురళి మోహన్ సెకండ్ లీడ్ గా నటించగా, మోహన్ బాబు విలన్ గా నటించారు. 19వ శతాబ్దంలో రాజుల సంస్థానం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. ఈ సినిమాలో దోపిడీ దొంగలను అరికట్టే హీరోగా కృష్ణ నటించారు. ఇక ఈ సినిమాలో ప్రభ, కాంచన, శ్రీ ప్రియా హీరోయిన్లు గా నటించారు. ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన సూర్యనారాయణ కి అంతకు ముందు తీసిన “మనుషులు చేసిన దొంగలు”, “దొంగలకు దొంగ” సినిమాలతో ప్లాప్ రాగా, ఆ తర్వాత తీసిన “దొంగల దోపిడి” సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంతో కృష్ణ పలు రికార్డులను తిరగరాశారు.

46Years for Krishna Dongala Dopidi Movie
46Years for Krishna Dongala Dopidi Movie

ఫస్ట్ డే అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్..

ఇక దొంగల దోపిడీ చిత్రం అప్పట్లో భారీ ఓపెనింగ్స్ సాధించింది. కృష్ణ అంతకు ముందే పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించగా, ఆ ఊపులో ఈ సినిమాకి సూపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక విదుడైన మొదటి రోజు దొంగల దోపిడీ చిత్రం 33 సెంటర్లలో రూ. 4,22,337 లక్షల రూపాయలు వసూలు చేయడం ద్వారా మొదటి రోజు అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమా నుండే మొదటిరోజుల రికార్డుల గోల మొదలైందని ఇండస్ట్రీ లో అంటారు. అంతకు ముందు కూడా కొన్ని చిత్రాలకు వచ్చినా, ఈ సినిమా నుండి ప్రతి స్టార్ హీరోల సినిమాలకు మొదటి రోజు కలెక్షన్లకు లెక్కలు వేయడం స్టార్ట్ చేసారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ సినిమాల మధ్య ఈ రికార్డుల గోల ఎక్కువగా ఉండేది. ఇక ఏఎన్నార్ తో కలిసి చేసిన “హేమాహేమీలు” సినిమాతో ఈ రికార్డు బద్దలు కొట్టారని అంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు