5 years of Brochevarevarura : ఎప్పటికి నిలిచిపోయే క్లాసిక్

5 years of Brochevarevarura: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది యంగ్ టాలెంటెడ్ దర్శకులు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఒకప్పుడు లా మాస్ కమర్షియల్ సినిమాలు చేయకుండా తమ అభిరుచులని తెలుపుతూ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాలను కూడా తీస్తున్నారు. ఒక ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో వివేక్ ఆత్రేయ ఒకరు. వివేక్ చేసినవి మూడు సినిమాలు అయినా కూడా వివేక్ కి కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. ఫ్యామిలీ అంతా కూడా కలిసి చూసే విధంగా సినిమాలు తీస్తూ ఉంటాడు వివేక్ ఆత్రేయ.

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ నిలిచింది. ఆ తర్వాత శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, సత్యదేవ్ వంటి నటులను పెట్టి బ్రోచేవారెవరు అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. బేసిగ్గా క్రైమ్ కామెడీ సినిమాలు చాలా తక్కువగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చాయి. వచ్చిన వాటిలో అన్ని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉండవు. అని బ్రోచేవారెవరురా సినిమా విషయానికి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు చూసే విధంగా ఉంటుంది ఈ క్రైమ్ కామెడీ సినిమా.

Brochevarevarura

- Advertisement -

సినిమాను చాలా అద్భుతంగా రాశాడు వివేక్ ఆత్రేయ. ఈ సినిమాలో ముఖ్యంగా ప్రతి పాత్రకి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, విశాల్ చిత్ర పరిశ్రమలో తానేంటో నిరూపించుకోవడం కోసం షాలిని అనే కథానాయికను కలిసి కథ వినిపించడానికి వెళతాడు. ఆ కథలో ముగ్గురు రాహుల్, రాకీ, రాంబో ఇంటర్మీడియట్ పాసవలేక చాలా సంవత్సరాల నుంచీ ఒకే కళాశాలలో చదువుతూ అధ్యాపకులచేత చీవాట్లు తింటూ ఉంటారు. ఇంతలో ఆ కళాశాల ప్రిన్సిపల్ కూతురు మిత్ర కూడా అక్కడికే వచ్చి చేరుతుంది. ఆమె కూడా చదువులో సున్నాయే కావడంతో వీరి ముగ్గురితో పరిచయం ఏర్పడుతుంది. మిత్రకు చదువు రాకపోయినా నాట్యం అంటే ఇష్టం. కానీ ఆమె తండ్రి మాత్రం ఆమె బాగా చదువుకోవాలని పట్టుబడుతుంటాడు. దానికోసం ట్యూషన్లకు కూడా పంపిస్తుంటాడు.అక్కడ ట్యూషన్ మాస్టర్ ప్రవర్తించే తీరు. ఆ విషయాన్ని ఇంట్లో కూడా చెప్పుకున్న అర్థం చేసుకోలేని ఫాదర్ ఇలాంటి సెన్సిటివ్ విషయాలను కూడా చాలా అద్భుతంగా చూపించాడు వివేక్ ఆత్రేయ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా గుర్తుండిపోయే సినిమాలు వచ్చాయి అటువంటి సినిమాల ప్రస్తావన వస్తే బ్రోచేవారెవరురా సినిమా కూడా ఉంటుంది.

ఈ సినిమాకి వివేక్ సాగర్ అందించడం మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. వివేక్ ఆత్రేయ వివేక్ సాగర్ కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ ఎప్పటికీ ఒక మంచి ఫీల్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ సినిమాకి పాటలు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా అందించాడు వివేక్. బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచి ఎంతోమందికి ఇష్టంగా మారిన ఈ సినిమా వచ్చి నేటికి ఐదేళ్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు