59 yrs for Anthasthulu : 59 వసంతాల క్లాసిక్ అంతస్తులు.. తెలుగుతెరపై మొదటిసారి ప్రేక్షకుల్ని భయపెట్టిన పాట ఈ సినిమాలోదే!

59 yrs for Anthasthulu : నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సినిమాల శైలి విభిన్నమైనది. తన సమకాలికుడు అయిన ఎన్టీ రామారావు పౌరాణిక, జానపదాలతో ఎక్కువగా ప్రేక్షకులని మెప్పిస్తే.. ఏఎన్నార్ మాత్రం సాంఘీక చిత్రాలతోనే ఎక్కువగా ప్రేక్షలులని అలరించారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకాదరణ ఎన్టీఆర్ కంటే ఎక్కువగా ఈయనకే ఉండేది. అందుకే కొన్ని సార్లు ఆయన స్థాయి కంటే తక్కువైన పాత్రలు కూడా చేసేవారు. ఇక నాగేశ్వరరావు నటించిన కొన్ని క్లాసిక్ చిత్రాలకు పేరు పెట్టలేము. ఇప్పుడు అవి చూడ్డానికి మామూలుగా అనిపించినా ఒకప్పుడు తెలుగునాట అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న చిత్రాలుగా నిలిచాయి. అలాంటి క్లాసిక్ చిత్రాల్లో ఏఎన్నార్ నటించిన “అంతస్తులు” చిత్రం కూడా ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు తో పాటు లెజెండరీ నటి భానుమతి, కృష్ణ కుమారి, గుమ్మడి వేంకటేశ్వరరావు, జగ్గయ్య వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలై నేటికి (59 yrs for Anthasthulu) (మే 27) 59 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా అంతస్తులు చిత్ర విశేషాలని కొన్ని గుర్తు చేసుకుందాం.

59 yrs for Anthasthulu Movie

అంతస్తులు కథ విషయానికి వస్తే…

రాజా జగన్నాథరావు అనే జమీందారు, క్రమశిక్షణతో నిమగ్నమయి ఉంటాడు. అయితే అవి నేటి కాలానికి తగ్గట్టుగా కాకుండా కఠినంగా ఉండేసరికి ఆయన కుమారుడు రఘు వ్యతిరేకిస్తాడు. ఇక ఒకసారి జగన్నాథరావు చిన్న కుమారుడు కొన్ని సార్లు కొన్ని నియమాల్ని హద్దు మీరాడని, జగన్నాథరావు విపరీతమైన కోపంతో చిన బాబును కొట్టే ప్రయత్నం చేస్తాడు, ఆ తరువాత ఒక్కసారిగా చినబాబు మానసిక షాక్ వల్ల మరణిస్తాడు. ఈ సంఘటన ఫలితంగా జగన్నాథరావు మనసు మానసికంగా విచ్ఛిన్నం అవుతుంది. అప్పటి నుండి అతను మంచం పడ్తాడు. అయితే అతడ్ని ఓ గతం అతనిని వెంటాడుతుంది. అతను ప్రేమిస్తున్న ఓ పేద మహిళను, ఆమెకు తనతో కలిగిన కూతురుని గుర్తు చేసుకుంటాడు. ఈ సంగతిని తన మరణానికి ముందే అతను రఘుతో రహస్యంగా పంచుకుని, తన కోరికను వ్యక్తపరుస్తాడు. రఘు ఏదో విధంగా ఆ అమ్మాయిని కనుగొని, తన కుటుంబంలో సభ్యునిగా చేసుకొనేందుకు రఘుతో మాట్లాడుతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, రాణి (భానుమతి). ఈమె పొట్టకూటి కోసం నృత్యం చేస్తూ, వీధుల్లో పాడుతూ ఉంటుంది. రఘు రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి, తన ఇంటికి తాను ప్రేమించిన మాలా అనే అమ్మాయి (కృష్ణ కుమారి) సహాయంతో తీసుకు వస్తాడు. ఈ క్రమంలో జగన్నాథరావు ఆస్తిపై కన్నేసి తమ చేతుల్లోకి తీసుకోవాలనుకున్న నాగు కు రఘు బుద్ధి చెబుతాడు. అయితే రాణి ని చివరికి తన కుటుంబంలో ఒకదానిగా ఎలా చేర్చుకున్నారో దానికి ఎన్ని పరిస్థితులు కారణమయ్యాయో చిత్ర యొక్క నేపథ్యం ఉంటుంది. అందరూ కలవడంతో కథ సుఖాన్తమయింది.

- Advertisement -

ప్రేక్షకులని భయపెట్టిన పాట…

ఇక అంతస్తులు సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే.. మొదట మాట్లాడాల్సింది ఈ చిత్ర పాటల గురించి. ఈ సినిమాలో అన్ని పాటలు హిట్ అవగా, ముఖ్యంగా “నిను వీడని నీడను నేనే” అనే పాట ఆరోజుల్లో బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికీ ఈ పాటంటే చాలా మందికి ఇష్టం. అయితే ఈ పాట వినేసరికి అందరూ ఈ సినిమా హారర్ చిత్రం అని అనుకుంటారు. కానీ సినిమాలో ఈ పాట నేపథ్యం వేరే ఉంటుంది. అయితే అంతస్తులు చిత్రం చూసిన ప్రేక్షకులు ఆరోజుల్లో బాగానే భయపడ్డారు. దాదాపు ప్రేక్షకుల్ని భయపెట్టిన మొదటి తెలుగు పాట ఇది అని అప్పట్లో ఏఎన్నార్ పలు ఇంటర్వ్యూ లలో చెప్పేవారు. ఇక ఈ సినిమా 1965 మే 27న విడుదలై ఘన విజయం సాధించింది. జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పై వి. బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన, ఈ చిత్రాన్నీ వి. మధుసూదన రావు దర్శకత్వం వహించాడు. కె. వి. మహదేవన్ సంగీతం స్వరపరచాడు. ఇక ఈ చిత్రం 1965 లో ఉత్తమ ప్రాంతీయ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ పొందింది. అంతే కాదు ఆ రోజుల్లోనే 1966 లో సిడ్నీలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈచిత్రం ప్రదర్శితమైనది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు