Tollywood : ఇండిపెండెన్స్ డే బరిలో ఏకంగా అరడజను.. ఎవరైనా తగ్గాల్సిందే?

Tollywood : టాలీవుడ్ లో ఈ ఏడాది సమ్మర్ చాలా బోసిపోయింది. ఒక్క సరైన సినిమా కూడా లేక చాలా చోట్ల థియేటర్లు మూతబడ్డాయి. సమ్మర్ లో రావాల్సిన పెద్ద సినిమాలన్ని ఇయర్ సెకండాఫ్ లో పండగలకి సెటిల్ అయ్యాయి. ఇక ఆ సినిమాలు కూడా రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చాక చెప్పడంతో వీటి ప్లేస్ లో మరో మీడియం రేంజ్ సినిమా కూడా రిలీజ్ కాలేదు. అవి కూడా రిలీజ్ డేట్లు వాయిదా వేసుకోగా, అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి సమ్మర్ లో. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన విజయం సాధించలేదు. ఇకపోతే సమ్మర్ ముగిసాక మాత్రం టాలీవుడ్ లో (Tollywood) జులై నుండి భారీగా సినిమాలు క్యూ కట్టేశాయి. పెద్ద సినిమాలు పండగల బరిలో ఫిక్స్ అయిపోగా, చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు లాంగ్ వీకెండ్ ఉన్న డేస్ ని పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో పుష్ప ది రూల్ ఆగష్టు 15 నుండి తప్పుకోవడంతో ఇండిపెండెన్స్ డే కి ఒక్కొక్కటిగా సినిమాలు రిలీజ్ కావడానికి క్యూ కట్టాయి. ఇప్పుడు వాటి లెక్క చూస్తే ఏకంగా అరడజను దాటింది.

6 Crazy Movies in Tollywood on Independence Day

ఇండిపెండెన్స్ డే బరిలో అరడజను లెక్క..

ఇక ఇండిపెండెన్స్ డే బరిలో పుష్ప2 తప్పుకున్నాక ఏకంగా అరడజను సినిమాలు ఆ డేట్ పై ఖర్చీఫ్ వేసాయి. అందరి కన్నా ముందు ఆ డేట్ పై కన్నేసింది డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ సినిమాని పూరి జగన్నాథ్ దర్శకత్వం చేస్తూ నిర్మిస్తుండగా, ఆగష్టు 15న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ సినిమాని కూడా ఆగష్టు 15న రీలాస్ చేసే ప్లాన్ లో ఉన్నాడు నిర్మాత నాగవంశీ. దీంతో పాటు సరిపోదా శనివారం ని ఆగష్టు 29న తీసుకురావాల్సి ఉండగా, పుష్ప తప్పుకోవడంతో 15కి తీసుకురావాలని భావిస్తున్నారట నిర్మాత దానయ్య. అలాగే రవితేజ హరీష్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ ని కూడా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా దింపాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ డేట్ కి మరో రెండు చిన్న సినిమాలు నిల్చుంటున్నాయి. నివేదా థామస్, ప్రియదర్షి ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ”35చిన్న కథ కాదు” సినిమాని అదే రోజున తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ బావమరిది మ్యాడ్ ఫేమ్ నార్నె నితిన్ హీరోగా నటిస్తున్న “ఆయ్” సినిమాని కూడా పంద్రాగస్ట్ న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

ఎవరైనా తగ్గాల్సిందే.?

అయితే ఆగష్టు 15 బరిలో ఏకంగా ఆరు సినిమాలు దిగేసరికి థియేటర్ల బయ్యర్లలో సంతోషం ఉన్నా, ఆయా చిత్రాల నిర్మాతలకి గుబులుగానే ఉంది. మంచి టాక్ వచ్చిన సినిమా నిలబడినా, ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తే థియేటర్ల సమస్య ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఓపెనింగ్ సమస్య చాలా ఉంటుంది. కాబట్టి కనీసం ఏవైనా రెండు పెద్ద సినిమాలు తప్పుతుంటే అన్ని సినిమాలకి న్యాయం జరిగినట్టు అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. అయినా ఖచ్చితంగా రిలీజ్ డేట్ వచ్చేసరికి ఎవరో ఒకరు తప్పుకోవడం ఖాయం. అయితే ఎక్కువగా లక్కీ భాస్కర్, మిస్టర్ బచ్చన్ ఆ డేట్ నుండి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆగష్టు 15 వచ్చేసరికి ఏ సినిమాలు తప్పుకుంటాయో, ఏయే సినిమాలు బరిలో నిలుస్తాయో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు