6 Years For Chilasow : రాహుల్ ఫస్ట్ అండ్ బెస్ట్ వర్క్

6 Years For Chilasow: కొన్ని సినిమాలకి పెద్ద పెద్ద భారీ బడ్జెట్ అవసరం లేదు. ఒక మామూలు కథను మనసుకు హత్తుకునేలా కూడా చెప్పొచ్చు అని నిరూపించిన సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి సినిమాలలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిలసౌ సినిమా ఒకటి. 2018 ఆగస్టు 3న వచ్చిన ఈ సినిమా నేటితో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని ఆ తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు రాహుల్ రవీంద్రన్. అయితే తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభను బయటకు తీసే ప్రయత్నంగా చిలసౌ సినిమాని చేశాడు. ఈ సినిమా మొదటి రోజు నుంచి డీసెంట్ టాక్ తో మంచి హిట్ సాధించింది. కేవలం హిట్ సాధించడం మాత్రమే కాకుండా అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా.

అయితే నటుడు లేదా హీరో దర్శకుడు అవుతున్నారు అన్నప్పుడు చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. అసలు డైరెక్షన్ ఎలా చేస్తాడు ఏ రకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అని అనిపించడం సహజం. రాహుల్ రవీంద్రన్ చాలా చిన్న కథను తీసుకొని దానికి చాలా హ్యూమన్ ఎమోషన్స్ యాడ్ చేసి చాలామందికి కనెక్ట్ అయ్యే మంచి స్టోరీని తీశాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.

చిలసౌ సినిమా కథ

అర్జున్ ( సుశాంత్ ) పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని బ్రహ్మచారి. అతని తల్లిదండ్రులు ( అను హసన్ మరియు సంజయ్ స్వరూప్), మరియు అతని బెస్ట్ ఫ్రెండ్ సుజిత్ ( వెన్నెల కిషోర్ ) నుండి నిరంతర ఒత్తిడి కారణంగా, అర్జున్ అంజలి ( రుహాని శర్మ ) అనే సంప్రదాయ మహిళతో బ్లైండ్ డేట్ చేయడానికి ఒప్పుకుంటాడు. అంజలి తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తుంది. తన కూతురికి పెళ్లి చేయలేకపోవడంలో తన తల్లి యొక్క నిరాశ మరియు అపరాధభావాన్ని కూడా చెబుతుంది.

- Advertisement -

ఇది విన్న తర్వాత, అర్జున్ అంజలి పట్ల సానుభూతి చూపిస్తాడు, అయితే వివాహ ప్రతిపాదనను అంగీకరించమని లేదా తిరస్కరించమని ఆమె అభ్యర్థనను అంగీకరిస్తాడు. అర్జున్ అంజలి గురించి తెలుసుకోవాలనుకుంటాడు కానీ డేట్ చేయడానికి సమయం లేదని అంజలిచెబుతుంది. ఇంతలో అంజలి తల్లి అసాధారణ రక్తపోటు కారణంగా ఆసుపత్రిలో చేరుతుంది. అంజలి తన తల్లి పరిస్థితి గురించి తెలుసుకుని, ఆమెను హాస్పిటల్‌లో డ్రాప్ చేయమని అర్జున్‌ని అడుగుతుంది. తరువాత జరిగే పరిణామాల్లో , అర్జున్ మరియు అంజలి ఒకరికొకరు అర్ధం చేసుకుంటారు.

Chi La Sow Telugu Movie Review | Sushanth Chi La Sow Cinema Review | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఈ సినిమా తర్వాత రాహుల్ రవీంద్రన్ తీసిన సినిమా మన్మధుడు 2. విజయభాస్కర్ దర్శకత్వంలో నాగర్జున చేసిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా వస్తుంది అన్నప్పుడు చాలామంది ఎన్నో అంచనాలతో ఎదురు చూశారు. కానీ ఈ సినిమా మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు రాహుల్ రవీంద్రన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు