68th Filmfare Awards: అవార్డుల పంట కురిపించిన ఆర్ఆర్ఆర్.. నెక్స్ట్ జాబితాలో వారే..!

68th Filmfare Awards.. తాజాగా 68వ ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇక 2023 సంవత్సరానికి గానూ సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డులను తాజాగా ప్రకటించారు.. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు సీతారామం సినిమా అత్యధిక అవార్డులు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.. ఉత్తమ నటుడు కేటగిరీ లో అవార్డు ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి లభించింది.. మరి ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరు ఈ ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారో ఇప్పుడు చూద్దాం.

68th Filmfare Awards: RRR who has reaped the rewards.. They are next in the list..!
68th Filmfare Awards: RRR who has reaped the rewards.. They are next in the list..!

తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 ప్రకటన జరిగింది. ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఏడు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది.. ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ , ఉత్తమ నటుడు వంటి ప్రధాన విభాగాలలో ఫిలింఫేర్ అవార్డులు కైవసం చేసుకోవడం గమనార్హం. ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలవగా… ఉత్తమ దర్శకుడు విభాగం లో రాజమౌళి అవార్డును అందుకోబోతున్నారు. ఉత్తమ నటుడు విభాగంలో ఇద్దరు ఎంపికైనట్లు సమాచారం.. ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఇద్దరికీ ఈ అవార్డు లభించింది.

అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సీతారామం ఫిలింఫేర్ అవార్డ్స్ లో హవా కొనసాగించింది. అలాగే ఐదు విభాగాలలో సీతారామం ఈ ఫిలింఫేర్ అవార్డులను దక్కించుకోవడం గమనార్హం .ఉత్తమ నటిగా మృనాల్ ఠాకూర్ కు ఫిలింఫేర్ అవార్డు లభించగా.. దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో అవార్డు దక్కించుకున్నారు. ఇకపోతే గత ఏడాది కొన్ని అనివార్య కారణాలతో ఫిలిం అవార్డులో ప్రకటన జరగలేదు. ఈ మేరకు 2022లో విడుదలైన చిత్రాలకు కూడా ఈ ఏడాది ప్రకటించగా.. ఘనంగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

- Advertisement -

68వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ తెలుగు విన్నర్స్ – 2023 :

ఉత్తమ చిత్రం – ఆర్ ఆర్ ఆర్

ఉత్తమ డైరెక్టర్ – రాజమౌళి

ఉత్తమ నటుడు – జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్

ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- దుల్కర్ సల్మాన్

ఉత్తమ నటి – మృనాల్ ఠాకూర్ (సీతారామం)

ఉత్తమ నటి (క్రిటిక్స్)- సాయి పల్లవి (విరాటపర్వం )

ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)

ఉత్తమ సహాయ నటి – నందితా దాస్ (విరాటపర్వం)

ఉత్తమ సంగీత ఆల్బమ్ – ఎంఎం కీరవాణి ( ఆర్ ఆర్ ఆర్)

ఉత్తమ సాహిత్యం – సిరివెన్నెల సీతారామశాస్త్రి -కానున్న కళ్యాణ్ (సీతారామం).

ఉత్తమ నేపథ్య గాయని – చిన్మయి శ్రీపాద – ఓ ప్రేమ ( సీతారామం)

ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ ( నాటు నాటు- ఆర్ ఆర్ ఆర్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్ ( ఆర్ ఆర్ ఆర్).

మొత్తానికైతే ఆర్ఆర్ఆర్ సినిమా ఏడు విభాగాలలో ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ఐదు విభాగాలలో ఫిలిం అవార్డులను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.. ఆ తర్వాత స్థానాలలో విరాటపర్వం నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు