96 Movie : క్లాసిక్ హిట్ కి సీక్వెల్.. ఆ రేంజ్ లో మళ్ళీ తీయలేరేమో?

96 Movie : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ, ఇప్పుడు తమిళ నాట స్టార్ హీరోగా, ఇండియా వైడ్ గా విలక్షణ నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక విజయ్ సేతుపతికి (Vijay Sethupathi) హీరోగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో “96” మూవీ కూడా ఒకటి. ఈ సినిమాలో విజయ్ తన ఇంటెన్స్ ఫీల్ గుడ్ నటనతో ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ గా నటించిన త్రిష (Trisha) కూడా తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఒక డిఫెరెంట్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీగా, ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లో సంచలన విజయం సాధించింది. కోలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు చర్చ అంటే, 96 సినిమా కి తాజాగా సీక్వెల్ రాబోతుందని అప్డేట్ అందింది.

96 Movie sequel announced by director Prem Kumar

సీక్వెల్ ప్రకటించిన డైరెక్టర్…

ఇక 96 సినిమాను ప్రేమ్‌ కుమార్‌ (Prem kumar) దర్సకత్వం వహించగా, ఈ డైరెక్టర్ తాజాగా, కార్తీ తో “మెయ్యళగన్” (Meiyazhagan) అనే సినిమా తెరకెక్కించగా, ఆ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో 96 సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు. దర్శకుడు ప్రేమ్ కుమార్ తాను తెరకెక్కించిన 96 కి సీక్వెల్‌ కథ కూడా సిద్ధం చేసినట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ టీజర్ లాంచ్ సందర్బంగా 96 సీక్వెల్ కథ సిద్ధమైందని చెప్పుకొచ్చాడు. అయితే అప్పట్లో సినిమా రిలీజ్ కాక ముందు సీక్వెల్‌ తీద్దామని అనుకోలేదని, అయితే 96 పెద్ద హిట్ అయ్యాకే సీక్వెల్ ఆలోచన వచ్చిందని, ఆ సీక్వెల్‌ కథలోనూ విజయ్‌ సేతుపతి, త్రిష పాత్రలనే ప్రధాన పాత్రలుగా తీసుకున్నట్లు దర్శకుడు ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ సేతుపతి, త్రిష ఎప్పుడు ఓకే అంటే అప్పుడే తన 96 సీక్వెల్‌ ని మొదలు పెడతానంటూ దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

96 రేంజ్ లో మళ్ళీ తీయలేరేమో?

అయితే సోషల్ మీడియాలో 96 (96 movie) సీక్వెల్ పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే 96 సినిమా ఒక క్లాసిక్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇలాంటి పాత్రలు మళ్ళీ రీ క్రియేట్ చేస్తే, ఆ స్థాయిలో ఆకట్టుకోకపోతే మూవీ లవర్స్ తీవ్రంగా నిరాశ చెందుతారు. అయితే కొన్ని క్లాసిక్ సినిమాలని టచ్ చేయకపోవడమే మంచిదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. పైగా 96 ని తెలుగులో జాను (Jaanu) గా రీమేక్ చేయగా, ఒరిజినల్ ని మ్యాచ్ చేయకపోయేసరికి ఇక్కడ ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. అందుకే ఆ క్లాసిక్ సీక్వెల్ పై దర్శకుడు మరోసారి ఆలోచిస్తే బెటర్ అని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు