Vijaydevarakonda : విజయ్ తో యుద్ధం.. మీరు సిద్ధమా..

Vijaydevarakonda : ఓవర్ నైట్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది..ఆ రిజల్ట్ తో పనిలేకుండా విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు.. ప్రస్తుతం వరుస సినిమాలకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. మొన్నీమధ్య కొత్త సినిమాను ప్రకటించాడు.. దానిగురించి అఫిషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే అనే పవర్ ఫుల్ కోటేషన్ ను రాశారు.. తాజాగా ఈ సినిమా ప్రోడక్షన్ హౌస్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది..

గతంలో విజయ్ నుంచి వచ్చిన ప్రతి సినిమా లవ్ అండ్ ఎంటర్టైనర్ కథతో వచ్చాయి.. ఇప్పుడు వచ్చే సినిమా భారీ యాక్షన్ తో రాబోతుందని పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది.. పాన్ ఇండియా లెవల్లో పీరియాడిక్ డ్రామాగా తెరాకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా తెరకేక్కిస్తుండగా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఇదిలా ఉండగా.. తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు.. తెలుగు అనర్గలంగా మాట్లాడేవారు, సినిమాల పై ఆసక్తి కలిగిన వాళ్లు ఈ సినిమాలో నటించవచ్చు..

A bumper offer for those who want to act in a Vijay Devarakonda film
A bumper offer for those who want to act in a Vijay Devarakonda film

ఆడిషన్స్ కోసం రావచ్చు అంటూ క్యాషిస్టింగ్ కాల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ పై ప్రొడక్షన్ హౌస్ మెయిల్ ఐడి.. ఫోన్ నెంబర్ ను కూడా ఇచ్చారు.. ఆ మెయిల్ కు ఇంస్టాగ్రామ్ రీల్స్ కాకుండా ఓన్లీ సెల్ఫ్ వీడియోలను పంపించవచ్చ అని పేర్కొన్నారు.. ఈ సినిమా రెగ్యూలర్ షూట్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.. విజయ్ ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నారు.. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం పక్కా అంటూ వార్తలు అప్పుడే మొదలయ్యాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు