A Journey to Kashi : ట్రైలర్ విడుదల

వారణాసి క్రియేషన్స్ పతాకం పై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ముఖ్య తారాగణం తో ముని కృష్ణ దర్శకత్వం లో దొరడ్ల బాలాజీ మరియు శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఏ జర్నీ టు కాశీ”. ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ నువిడుదల చేసారు.

అనంతరం హీరో చైతన్య రావు మాట్లాడుతూ “ఏ జర్నీ టు కాశీ చిత్రం నా కెరీర్ ప్రారంభంలో చేసిన చిత్రం. చాలా మంచి కథ. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు ముని కృష్ణ గారికి నిర్మాతలు బాలాజీ గారికి శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు. ఇది చాలా అరుదైన చిత్రం. మంచి కంటెంట్ ఉన్న చిత్రం, ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలి, కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలా రియలిస్టిక్ గా నాచురల్ గా ఉంటుంది. మా చిత్రం పనోరమా ఫిలిం ఫెస్టివల్ లో టాప్ 25 లిస్ట్ లో నిలిచింది. కోలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో విన్నర్ గా నిలిచింది. ఖ్యాతిలీన్ మరియు ప్రియా చాలా బాగా నటించారు. ఖ్యాతిలీన్ కి ఇది మొదటి సినిమా. తన మొదటి సినిమాలోనే ఇలాంటి క్యారెక్టర్ చేయటం చాలా గొప్ప విషయం. ప్రతి నటుడికి ఇలాంటి చిత్రం ఒకటి పడాలి, నేను ఇలాంటి చిత్రం చేయటం చాలా గొప్ప గా భావిస్తున్న. డిసెంబర్ 17 న విడుదల అవుతుంది. అందరు చూసి మా చిత్రాన్ని హిట్ చేస్తారు” అని కోరుకున్నారు.

హీరోయిన్ ఖ్యాతిలీన్ గౌడ మాట్లాడుతూ “ఇది నా మొదటి సినిమా, చాలా స్పెషల్ చిత్రం నాకు. హీరో చైతన్య మరియు దర్శకుడు ముని కృష్ణ గారు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసారు. కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులు చూస్తున్నారు, మా చిత్రంలో అద్భుతమైన కథ ఉంది, కాశీ గురించి దాని విశిష్టత గురించి గొప్పగా చెప్పారు. ఈ చిత్రం లో అందమైన ప్రేమకథ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది” అని తెలిపారు.

- Advertisement -

దర్శకుడు ముని కృష్ణ మాట్లాడుతూ “ఏ జర్నీ టు కాశీ అనేది మన జీవితం లో చాలా ముఖ్యమైన విషయం. భారత ఖండానికి కాశీ ఒక ఆత్మ లాంటిది. కుంభమేళా షాహిస్తాన్ రోజు రెండు కోట్లమంది గంగానదిలో పవిత్ర సాన్నం చేస్తారు. చేసి జన్మరాహిత్యం పొందారని భావిస్తారు. కాశీ లో చనిపోతే మోక్షప్రాప్తి పొందుతారు అనే నమ్మకం మనకి ఉంది. ఇది ఒక రోడ్ జర్నీ కథ. కాశీ యాత్ర వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకువచ్చిందో తెలుసుకోవాలి అంటే మా చిత్రాన్ని చూడండి. డిసెంబర్ 17న విడుదల చేస్తున్నాం, అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ “ఏ జర్నీ టు కాశీ చాలా అరుదైన సినిమా. మంచి సినిమా నిర్మించామని తృప్తి మాకుంది. డిసెంబర్ 17 న రెండు రాష్ట్రాలలో విడుదల అవుతుంది. అందరు చూసి మా చిత్రాన్ని హిట్ చేస్తారు అనే నమ్మకం మాకుంది” అని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు