Raj Tarun: రాజ్ తరుణ్​కు కొత్త ట్యాగ్​… ఇకపై అలానే పిలవాలి !

Raj Tarun:ఏ ఇండస్ట్రీలోనైనా హీరోలుగా రాణించాలంటే చాలా కష్టం. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న అబ్బాయిలు మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తారు. కొంతమందికి లక్ కలిసి రావడం వల్ల ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదుగుతారు. అలాంటివారిలో హీరో రాజ్ తరుణ్ ఒకరు అని చెప్పవచ్చు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉయ్యాల జంపాల సినిమాతో ఐదేళ్ల క్రితం సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోల్లో మొదటి స్థానంలో ఉన్నాడు.

తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకొని ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. చిన్నతనం నుంచి సినిమాలపై ఇష్టం పెంచుకున్న రాజ్ తరుణ్….. మొదటగా షార్ట్ ఫిలిమ్స్ లలో నటించాడు. ఏకంగా 52 షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన సహజమైన నటనతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21ఎఫ్ సినిమాలతో మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ సినిమాల తర్వాత ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక్క హిట్ కూడా పడలేదు.

కాగా రాజ్ తరుణ్, హాసిని శ్రీధర్ జంటగా…. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మాణంలో రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “పురుషోత్తముడు”. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, మురళీ శర్మ, ముఖేష్ కన్నా లాంటి ఎంతోమంది స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా జూలై 26వ తేదీన రిలీజ్ అయింది.

- Advertisement -

Do you know how many cases there are against hero Raj Tarun?

ఈ తరుణంలోనే రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోకు కొత్తగా ఇమేజ్ ట్యాగ్ వచ్చింది. తన పేరు ముందు “జోవియల్ స్టార్” అని చేరింది. ఇవాళ రిలీజ్ అయిన పురుషోత్తముడు సినిమా టైటిల్స్ పడే సమయంలో జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అని టైటిల్ వేశారు. ఈ సినిమాకి ముందు రాజ్ తరుణ్ కు ఎలాంటి ట్యాగ్ లేదన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ తరుణ్ కు జోవియల్ స్టార్ అని చేరడంతో ఈ వార్త వైరల్ అవుతుంది. కాగా ఇటీవల లావణ్య కేసులో రాజ్‌ తరుణ్‌ ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు