Chiranjeevi : ‘ఐఫా’ ఉత్సవం తరపున మెగాస్టార్ చిరుకి అరుదైన గౌరవం!

Chiranjeevi : టాలీవుడ్ లో ఈ ఇయర్ ఐఫా అవార్డు ఉత్సవం గ్రాండ్ గా జరగబోతుందన్న విషయం తెలిసిందే. 2023 వచ్చిన ఉత్తమ చిత్రాలకు గాను 2024 లో ఐఫా అవార్డుల పేరిట పురస్కారాలు అందచేయనున్నారు. ఇక ఈ ఏడాది అత్యధికంగా దసరా, బలగం లాంటి చిత్రాలు ఎక్కువ నామినేషన్లలో నిలవగా, IIFA ఉత్సవం శుక్రవారం, 6 సెప్టెంబర్ & శనివారం, 7 సెప్టెంబర్ 2024న జరగనుండగా, మొదటి రోజు తమిళం, మలయాళ భాషల సినిమాల విజేతలకు అవార్డులు, రెండో రోజు తెలుగు, కన్నడ భాషల విజేతలకు అవార్డులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా ఈ వేడుకలో ప్రతి సంవత్సరం లైఫ్ టైం అచీవ్ మెంట్, లేదా ఇతర గౌరవమైన పేర్ల మీద పలువురు లెజెండరి నటులకు. లేదా దర్శకనిర్మాతలకు, టెక్నిషియన్స్ కి గౌరవ పురస్కారం అందచేస్తుంటారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవికి ఆ పురస్కారం లభించనుంది.

A rare honor for Megastar Chiranjeevi on behalf of the 2024 'IIFA' festival

చిరుకు ఐఫా గౌరవ పురస్కారం…

టాలీవుడ్ ని మూడు దశాబ్దాలు ఏలిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రీసెంట్ గా భారత ప్రభుత్వం నుండి ‘పద్మ విభూషణ్’ అవార్డు పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఎంతో అభివృద్ధి చేసిన లెజెండరి నటుల్లో ఆయన కూడా ఒకరు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఇప్పుడు మరో అరుదైన గౌరవం మెగాస్టార్ చిరంజీవిని వరించింది. ఈ ఇయర్ జరగబోతున్న IIFA ఉత్సవం 2024 కి గానూ, “ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా” పేరిట గౌరవాన్ని మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు. ఈ వార్త విన్నప్పటినుండి మెగాభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ వేడుక జరుగనున్నట్టు సమాచారం.

- Advertisement -

రిలీజ్ కి రెడీ అవుతున్న విశ్వంభర…

ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య, బ్లాక్ బస్టర్ కొట్టగా ఆ సినిమాతో ఈ ఇయర్ ఐఫా అవార్డుల్లో, ఇంకా ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో నామినేషన్లలో కూడా నిలిచారు. ఇక భోళా శంకర్ తో ప్లాప్ అందుకున్నా, నెక్స్ట్ విశ్వంభర తో అభిమానులని పలకరించడానికి రెడీ అవుతున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’. 200 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మూడు పాటలు రెడీ అవగా, మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా విశ్వంభర టీజర్ రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు