Ambani: అంబానీ కొడుకుకు రూ.40 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చిన స్టార్ హీరో ..?

Ambani: ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లలో….. ఎక్కడా చూసినా ప్రతి ఒక్కరి నోట ముకేశ్ అంబానీ కుమారుడు అనంత అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ వేడుక గురించి మాట్లాడుకుంటున్నారు. వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. సుమారు 5000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి వీరి వివాహాన్ని జరిపించారని వార్తలు వస్తున్నాయి. వీరి వివాహానికి ప్రముఖ సినీ నటీనటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అందరూ వివాహానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇక మరి ముఖ్యంగా సినీ నటీనటులు వీరి వివాహంలో ఆటపాటలతో తెగ సందడి చేశారు. ఇక వివాహం కోసం ముఖేష్ అంబానీ రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి. అంబానీ ఆస్తుల్లో రూ. 5వేల కోట్లు అంటే 0.05 శాతం మాత్రమే. ఇది వారికి చాలా తక్కువ బడ్జెట్. రూ. 5వేల కోట్లు అంటే వారికి ఒక లెక్క కాదు. ఇక మరికొందరేమో 5వేల కోట్ల కన్నా ఎక్కువే ఖర్చు అయిందని అంటున్నారు.

A star hero who gave a gift of Rs. 40 crores to Ambani’s son

ఇదిలా ఉండగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారనే వార్త ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నివేదిక ప్రకారం…. షారుక్ ఖాన్…. నూతన దంపతులకు ఫ్రాన్స్ లో రూ. 40 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ ను బహుమతిగా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఇక అమితాబ్ బచ్చన్ కుటుంబం రూ. 30 కోట్ల విలువైన నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాకుండా మరి కొంతమంది సెలబ్రిటీలు కోట్ల విలువ చేసే కార్లు, వాచ్ లు, విల్లాలు గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు