Vijay Deverakonda : ఏంటి రౌడీ హీరో.. లైవ్ లోనే ఆ పని మొదలెట్టేశావా..?

Vijay Deverakonda : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ రీసేంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా కథ కొత్తగా ఉన్నా జనాలకు కనెక్ట్ అవ్వలేకపోయింది దాంతో సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. మొన్న వచ్చిన కల్కి సినిమాలో అర్జునుడు పాత్రలో నటించి మెప్పించాడు… ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో విజయ్ కు మంచి మార్కులు పడ్డాయి.. ఇక విజయ్ తాజాగా లైవ్ లో చేసిన ఓ పని జనాలను ఆకట్టుకుంది.. అతని ఔన్నత్యానికి ఫిదా అవుతున్నారు.. ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

విజయ్ దేవరకొండ కల్కిలో చేసింది చిన్న పాత్రే.. కానీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. కాగా, రౌడీ హీరో ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.. ఆ సినిమాలో షూటింగ్ జరుపుకుంటున్నాయి.. తాజాగా విజయ్ దేవరకొండ ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్ట్ గా వచ్చారు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేసారు. విజయ్ దేవరకొండ ఈ ఎపిసోడ్ లో ఫుల్ సందడి చేసినట్టు తెలుస్తుంది. విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఈ షోలో కాసేపు కామెడితో నవ్వించేసారు సింగర్స్..

A video of Vijay Devarakonda playing cricket with a child is viral in social media
A video of Vijay Devarakonda playing cricket with a child is viral in social media

ఈ సందర్బంగా ఓ కంటెస్టెంట్ బ్రదర్ స్టేజ్ మీదకు రాగా అతనితో కాసేపు సరదాగా గడిపాడు.. అనంతరం క్రికెట్ కూడా ఆడాడు.. ఆ కంటెస్టెంట్ తల్లి స్టేజిపైకి రాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ.. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి మనకు అమ్మలను ఇచ్చినందుకు. మా అమ్మ నువ్వుతూ హ్యాపీగా ఉంటే నేను అన్ని ఆపేసి అలాగే చూస్తుంట అని అన్నాడు.. ఆ మాటకు అక్కడ ఉన్న వాళ్లంతా ఫిదా అయ్యారు.. విజయ్ దేవరకొండ ఆ షోకి రావడంతో సందడిగా సాగినట్లు ప్రోమోలో చూస్తే తెలుస్తుంది.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో విజయ్ లైవ్ లోనే పిల్లాడితో ఆటలు మొదలెట్టేవా అంటూ కామెడీగా కామెంట్స్ పెడుతున్నారు.. ఆ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకోండి..

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు