Aa Okkati Adakku: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘ఆ ఒక్క‌టి అడ‌క్కు’

Allari Naresh: అల్లరి నరేష్ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అల్లరి నరేష్ సినిమాలంటే తప్పకుండా కామెడీ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి అల్లరి నరేష్ సినిమాలంటే చాలా ఇష్టం. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు.అల్లరి నరేష్ తాజాగా నటించిన చిత్రం “ఆ ఒక్కటి అడక్కు”. ఈ సినిమా కామెడీ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమాని మే 3వ తేదీన థియేటర్లోకి విడుదల చేశారు.

ఈ చిత్రానికి మళ్లీ అంకం దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్ కు జోడిగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ నటి జామీ లెవెర్, వెన్నెల కిషోర్, ఆరియానా గ్లోరీ, వైవా హర్ష, రవితేజ, రీతు చౌదరి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాని చిలక ప్రొడక్షన్ బ్యానర్ పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే….ప్రభుత్వ ఉద్యోగం చేసే అల్లరి నరేష్ వివాహం కోసం పడే తంటాల చుట్టూ ఈ సినిమాని తెరకెక్కించారు.

Aa Okkati Adakku makes its OTT debut

కాగా, ఈ సినిమాలో ఏజ్ బారైనా ఓ వ్యక్తి పెళ్లి కోసం పడే తంటాలను చూపించారు. అందుకోసం మ్యాట్రిమోనీ సైట్ ను కలవడం, వారు చేసే మోసాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా మే 31వ తేదీ నుంచి ఓటిటిలోకి రానుందని అక్కడక్కడ వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ప్రకటన రాలేదు. ఇక ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఆ ఒక్కటి అడక్కు సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు భాషలో మాత్రమే ఆ ఒక్కటి అడక్కు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు