Aadi : ఈసారి ప్రిపేరై వస్తున్నాడు.. ఇప్పుడైనా లక్ కలిసొస్తుందా?

Aadi : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వగా, తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీని తనవైపు చూసేలా చేసాడు. ఆ తర్వాత వచ్చిన లవ్ లీ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో, సాయి కుమార్ కి మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ క్రేజ్ ఎక్కువకాలం నిలవ లేదు. ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి ప్లాప్ అయ్యాయి. దాదాపు పదేళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకపోవడంతో ఆది మార్కెట్ చాలా డ్యామేజ్ అయింది. ఇక ఆది అయినప్పటికీ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక లాస్ట్ ఇయర్ టాప్ గేర్ అనే సినిమాతో వచ్చి నిరాశపరచగా, ఈ ఇయర్ ఓ భారీ డివోషనల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. తాజాగా ఆది హీరోగా “ష‌ణ్ముఖ” అనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు.

Aadi Saikumar Upcomig movie Shanmukh Update

షణ్ముఖ గా రానున్న ఆది..

ఇక ఆది (Aadi) హీరోగా షణ్ముఖ అనే కొత్త సినిమాలో నటిస్తుండగా, ఒక డివోష‌న‌ల్ యాక్షన్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ‘ష‌ణ్ముగం సాప్ప‌ని’ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. టాలెంటెడ్ బ్యూటీ అవికాగోర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను సాప్‌ బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ పై సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ, ఈ చిత్ర షూటింగ్ పూర్తఅయిందని తెలిపారు. ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు ష‌ణ్ముగం సాప్ప‌ని ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశాడు. ఇక ఈ సినిమాలో ఆది తన కెరీర్ లోనే భిన్నమైన లుక్ తో పాటు, సరికొత్తగా కనిపించనున్నాడట.

- Advertisement -

ప్రిపేరై వస్తున్న ఆది..

ఇక షణ్ముఖ సినిమా గురించి ప్రస్తావిస్తే… ఈ సినిమాతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని మంచి పాయింట్‌తో ఈ డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ తెరకెక్కుతుంది. ఇక రీసెంట్ గా హైద‌రాబాద్‌లో ఓ ఖ‌రీదైన సెట్‌ను వేసి చివ‌రి షెడ్యూల్‌ను పూర్తి చేసిన‌ట్లు దర్శకుడు షణ్ముగం సాప్పని తెలిపారు. ఇక ఈ సినిమాకు కేజీఎఫ్‌ ఫేమ్ ర‌వి బ‌సూర్ స్ట‌నింగ్ మ్యూజిక్‌ను అందించిన‌ట్లు చెప్పారు. అలాగే ఒక డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది కాబట్టి, ఆది కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా ఆది దాదాపు డజనుకిపైగా ప్లాప్ లు అందుకున్నాడు. ఇప్పుడు షణ్ముఖతో మాత్రం బాగా ప్రిపేర్ అయి, పక్కా ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. మరి షణ్ముఖ సినిమాతో నైనా ఆది కి బ్రేక్ వచ్చే టాలీవుడ్ లో స్థిర పడేలా చేస్తుందో లేదో చూడాలి. ఇక షణ్ముఖ సినిమా దర్శకుడు మూవీ సక్సెస్ అవుతుందని ధీమాగా చెప్తుండగా, ఈ సినిమాతో ఆది హిట్ కొడితే అది చరిత్రే అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు