GameChanger : గ్లోబల్ స్టార్ కి పోటీగా బాలీవుడ్ స్టార్స్.. హాలీవుడ్ నుండి కూడా..

GameChanger : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ లో విడుదలవుతుందని దిల్ రాజు రీసెంట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. మూడేళ్ళుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మొన్నటివరకు ఇండియన్2 వల్ల ఈ సినిమాకి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కావడమూ, ప్లాప్ కావడమూ జరిగిపోయింది. అందుకే దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ ని కంఫర్మ్ చేస్తూ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రిస్మస్ కు తీసుకువతున్నామని ప్రకటించాడు. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాకి సంబంధించి తన షూటింగ్ ని మొత్తం పూర్తి చేయగా, మహా అయితే ఒకటి లేదా రెండు రోజులు సెట్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది రిలీజ్ కి ఏ టైమూ లేనట్టు క్రిస్మస్ కి ప్రకటించాడు దిల్ రాజు. అయితే ఇప్పుడు గ్లోబల్ స్టార్ కి పోటీగా బాలీవుడ్ లో బడా స్టార్లు దిగుతున్నారు.

Aamir Khan and Varun Dhawan movies to compete with Ram Charan's Game Changer

గ్లోబల్ స్టార్ కి పోటగా బాలీవుడ్ స్టార్స్…

గేమ్ చేంజర్ ని డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గేమ్ చేంజర్ శంకర్ సినిమా పైగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కాబట్టి, రికార్డుల విషయంలో తెలుగులో డోకా లేదు. కానీ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇతర భాషల్లో కూడా ఓపెనింగ్స్ ముఖ్యం. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కి బాలీవుడ్ లో మాత్రం గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది. బాలీవుడ్ లో క్రిస్మస్ కి అంటే డిసెంబర్ 20న అదే డేట్ కి మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న ‘సితారే జమీన్ పర్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుందట. ఈ సినిమా గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘తారే జమీన్ పర్’ సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కడం విశేషం. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సినిమా వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటిస్తున్న “బేబీ జాన్” సినిమా కూడా క్రిస్మస్ కి రానున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా విజయ్ నటించిన పోలీసోడు సినిమాకి రీమేక్ అని సమాచారం. అయితే ఈ రెండు సినిమాల నుండి గేమ్ చేంజర్ కి గట్టి పోటీ ఉందని చెప్పాలి. గేమ్ ఛేంజర్ కి మంచి టాక్ వచ్చినా ఓపెనింగ్స్ లో ఈ రెండు సినిమాల దెబ్బ పడొచ్చు.

- Advertisement -

హాలీవుడ్ లోనూ.. గట్టి పోటీ..

అయితే గేమ్ ఛేంజర్ కి బాలీవుడ్ నుండే కాదు హాలీవుడ్ లో కూడా గట్టి పోటీ ఎదురవుతుంది. హాలీవుడ్ లో ఈ క్రిస్మస్ కి మోస్ట్ అవైటెడ్ మూవీ “ది లయన్ కింగ్” సినిమాకు సీక్వెల్ గా వస్తున్న “ముఫాసా – ది లయన్ కింగ్” ని కూడా క్రిస్మస్ కి రిలీజ్ చేస్తున్నారట. ఈ సినిమాకి ఇండియాలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ముఫాసా వల్ల మల్టీప్లెక్స్ ఆడియన్స్ దెబ్బ పడే ఛాన్స్ ఉంది. అందుకే గేమ్ ఛేంజర్ వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ లో గట్టి దెబ్బ ఎదురవుతుందనిచరణ్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అయితే కొంతమంది అభిమానులు గేమ్ ఛేంజర్ ని దీపావళికి ప్రీ పోన్ చేయాలనీ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే మేకర్స్ నుండి అఫిషియల్ గా రిలీజ్ డేట్ పోస్టర్ అయితే రాలేదు. మరి ఖచ్చితంగా క్రిస్మస్ బరిలో నిలుస్తారా లేదా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు