Aamir Khan: అంతా జరిగిపోయింది ఇంకా రీమేక్ చేసి ప్రయోజనం ఏముంది.?

Aamir Khan: టాప్ ఇండియన్ యాక్టర్స్ లో అమీర్ ఖాన్ ఒకరు. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా అమీర్ ఖాన్ పై అభిమానంతో ఆయన సినిమాలు చూసిన ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ సబ్ టైటిల్స్ పెట్టుకొని మరి అమీర్ ఖాన్ సినిమాలు చూశారు. అలానే ఆఫ్ స్క్రీన్ లో అమీర్ ఖాన్ మాటలు కూడా ఫిదా అయిపోయే అభిమానులు ఉన్నారు. చాలా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు అమీర్ ఖాన్ తీస్తూ ఉంటారు. అమీర్ ఖాన్ ఇప్పుడు ఒక రీమేక్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

ముందుగా తమిళ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన విజయ్ సేతుపతి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన పిజ్జా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించుకుంది. ఆ తర్వాత తమిళ్ లో విజయ్ సేతుపతి కూడా కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపాడు. అలానే చాలామంది కి విజయ్ సేతుపతికి కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఇక ప్రస్తుతం విజయ్ కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. అమీర్ ఖాన్ చేసిన లాల్ సింగ్ చద్దా సినిమాలో విజయ్ సేతుపతిని తీసుకునే ప్రయత్నం కూడా చేశారట అమీర్, కానీ అది జరగలేదు. ఇకపోతే విజయ్ సేతుపతి మైల్ స్టోన్ సినిమాను అమీర్ ఖాన్ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Aamir Khan

- Advertisement -

చాలామంది తెలుగు హీరోలు ఒక సినిమా కోసం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కేటాయిస్తుంటే మరోవైపు తమిళ్ హీరోలు మాత్రం మైల్ స్టోన్ ఫిలిమ్స్ చేస్తున్నారు. ఇప్పటికే ధనుష్ 50 సినిమాలు పూర్తి చేశాడు. అలానే విజయ్ సేతుపతి కూడా 50 సినిమాలను పూర్తి చేశాడు. విజయ్ 50 వ సినిమాగా మహారాజా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ కథ వినడానికి పాతది అయినా కూడా ఆ కథను ట్రీట్ చేసే విధానం స్క్రీన్ ప్లే అద్భుతంగా వర్క్ అంటే బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే సినిమాను హిందీలో అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అందరూ చూసేసిన ఆ సినిమాను ఇప్పుడు రీమేక్ చేసి ఏంటి ప్రయోజనం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు