Aamir Khan: మూడో పెళ్లికి సిద్ధం.. ఊహించని కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్..!

Aamir Khan.. ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan)ఇప్పుడు మరో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి అసలు విషయానికొస్తే.. తాజాగా నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో అమీర్ ఖాన్ పాల్గొన్నారు. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఈయన.. అనంతరం వైవాహిక బంధం పై కూడా మాట్లాడారు. బంధం ఏదైనా సరే సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అనేది ఇద్దరు వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని, విడాకులు తీసుకున్నప్పటికీ తన మాజీ భార్యలతో తాను మంచి సంబంధాన్ని కలిగి ఉన్నానని తెలిపారు అమీర్ ఖాన్. అంతేకాదు తన భార్యలకు తాను విడాకులు ఇచ్చినా.. ఇప్పటికీ వారు తమ కుటుంబ సభ్యులే అంటూ చెప్పుకొచ్చారు.

Aamir Khan: Prepare for third marriage.. Aamir Khan made unexpected comments..!
Aamir Khan: Prepare for third marriage.. Aamir Khan made unexpected comments..!

వివాహ బంధం పై కామెంట్స్..

ఇంటర్వ్యూలో భాగంగా.. వివాహ వ్యవస్థ ఇప్పుడు చాలా మారిపోయింది. వివాహ బంధం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి..? అంటూ రియా చక్రవర్తి అమీర్ ఖాన్ ను ప్రశ్నించగా.. వైవాహిక బంధం లో తాను రెండుసార్లు ఫెయిల్యూర్ గా మిగిలిపోయారని తెలిపారు.. కాబట్టి పెళ్లి విషయంలో నా సూచనలు తీసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా నాకు ఒంటరిగా జీవించడం ఇష్టం ఉండదు. నాకంటూ ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటాను.ఒకరితో కలిసి ఉండడం, ఇష్టాయిష్టాలు ,కష్టసుఖాలు పంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక నా మాజీ భార్యలు కిరణ్ , రీనా తో నాకు ఎంతో మంచి అనుబంధము ఉంది. నా దృష్టిలో మేమంతా ఒకే కుటుంబం. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము కదా.. అందుకే వైవాహిక బంధం సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము అంటూ ఆయన సమాధానం తెలిపారు

మళ్లీ పెళ్లి పై క్లారిటీ..

మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? ఆలోచన మీకు ఉందా..? అని రియా చక్రవర్తి అడగ్గా.. ప్రస్తుతం నా వయసు 59 ఏళ్లు ఇప్పుడు మళ్లీ నాకు పెళ్లి అంటే కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. నా కుటుంబం, పిల్లలు, స్నేహితులతో నేను మళ్ళీ కనెక్ట్ అయ్యాను. నాకు ఇష్టమైన వారితో సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు ఆనందంగా కూడా ఉన్నాను. ఇక నన్ను నేను మరింత మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటూ తెలిపారు అమీర్ ఖాన్.

- Advertisement -

రీనా దత్తా తో అమీర్ ఖాన్ పెళ్లి..

1986లో రీనా దత్తాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు అమీర్ ఖాన్. అయితే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో పరస్పర అంగీకారంతోనే 2002లో విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పటికీ ఈమెతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అమీర్ ఖాన్.

కిరణ్ రావు తో పెళ్లి..

ఆ తరువాత కిరణ్ రావు ను వివాహం చేసుకున్నారు. లగాన్ కు ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, పరిచయం స్నేహంగా మారి, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో 2005లో వివాహానికి దారి తీసింది. ఇక 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు