Aishwarya Rai: గాయంతోనే కేన్స్ ఫీలింగ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాకింగ్

Aaradhya Bachchan SPOTTED helping injured mom Aishwarya Rai:  బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య రాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటినుంచి ఇప్పటివరకు… దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతోంది ఐశ్వర్య రాయ్. పెళ్లయి… తన ఎత్తు కూతురు ఉన్నా సరే… బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయికి ఎక్కడ కూడా క్రేజ్ తగ్గలేదు. అయితే తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాయికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రతి ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాయి వచ్చింది. ఫ్రాన్స్ దేశంలో 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరిగింది. భారతదేశం తరపున చాలామంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇందులో భాగంగానే హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఆమె కూతురుతో ఈ పెద్ద కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్టులో ఈ బ్యూటీ మెరిసింది. కానీ తన కుడి చేతికి మాత్రం… పెద్ద గాయం అయినట్లు స్పష్టంగా కనిపించింది. వైట్ పట్టీతో… ఐశ్వర్యరాయ్ చేతు కవర్ చేయబడింది. దీంతో ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కి పెద్ద గాయం అయినట్లు అందరూ బాధపడుతున్నారు. ఇక తీవ్రంగా గాయపడిన ఐశ్వర్యారాయ్… తన కూతురి సహాయాన్ని తీసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపించింది. కాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 2002 సంవత్సరంలో తొలిసారిగా మెలిసింది బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్. అయితే..ఈ సారి కేన్స్ ఫీలింగ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై గాయంతోనే ఐశ్వర్యరాయ్ వాకింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు