Aay: బన్నీ వాసు ప్లాను బాగానే వర్కౌట్ అయింది

Aay: తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాకి ఎప్పుడు బ్రహ్మరథం పడతారు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నంత సినిమా పిచ్చి అభిమానులు ఇంకో ఇండస్ట్రీలో ఉండరు అని కూడా చెప్పొచ్చు. ఒక గొప్ప సినిమాను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఏ భాషలో ఉన్నా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి తెలుగు ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. సినిమా కంటెంట్ నచ్చితే అది చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా లేకుండా ఎగబడి మరీ చూస్తారు. అయితే ఈ విషయం రీసెంట్ టైమ్స్ లో చాలామందికి అర్థమైంది.

ఇక ఆగస్టు 15 సందర్భంగా రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్, రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. రవితేజ, రామ్ కి ఎంత పెద్ద క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ సినిమాలు కోసం ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్న తరుణంలో వీటి మధ్య మరో చిన్న సినిమాను ప్లాన్ చేశాడు నిర్మాత బన్నీ వాసు. ఆ సినిమా ఆయ్. ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు.

Aay

- Advertisement -

అయితే మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ తోపాటు విక్రమ్ నటించిన తంగలన్ సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఆగస్టు 15 రిలీజ్ అయిన అన్ని సినిమాలలో కంటే ఆయ్ సినిమా మంచి రెస్పాన్స్ ను సాధించుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకి రెండు కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇంక మౌత్ టాక్ తో ఈ సినిమా సక్సెస్ అయి మరికొన్ని థియేటర్లో షో స్ కూడా పెరగనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఏదేమైనా బన్నీ వాసు ప్లాన్ అద్భుతంగా వర్కౌట్ అయింది అని చెప్పాలి. కంటెంట్ మీద నమ్మకంతో రిలీజ్ చేయడంతో ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు