Aay – Committee Kurrollu : చిన్న సినిమాలు పెద్ద ఇంపాక్ట్

Aay – Committee Kurrollu : కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పటికీ మంచి ఆదరణను పొందుకుంటాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో చాలా సినిమాలు కంటెంట్ వలన హిట్ అయ్యాయి. కొత్త కాన్సెప్ట్ సినిమాలను ఎంకరేజ్ చేయడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు అని చెప్పాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో చాలామంది కొత్త దర్శకులు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాలో సరైన కంటెంట్ ఉంటే ఎంతటి పెద్ద సినిమాలతో రిలీజ్ చేసినా కూడా దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆ సినిమా సంపాదించుకుంటుంది.

ఆగస్టు 15 సందర్భంగా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు నెగిటివ్ టాక్ ను సాధించుకున్నాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan) సినిమా మొదటి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా తర్వాత ఆ సినిమాలో కూడా ఏమీ లేదని తేలిపోయింది. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన సినిమా డబుల్ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. రంజిత్(Ranjith) దర్శకత్వంలో వచ్చిన తంగలన్ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.

Committee Kurrollu

- Advertisement -

బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన ఆయ్ (aay) సినిమా అదే రోజున ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకి సరైన థియేటర్స్ దొరకలేదు. కానీ ఈ సినిమా ప్రదర్శించబడిన కొన్ని థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మెల్లగా ఈ సినిమాకు థియేటర్స్ పెరగడంతో పాటు మెరుగైన కలెక్షన్లు కూడా వస్తున్నాయి. అలానే ఆగస్టు 9న రిలీజ్ అయిన సినిమా కమిటీ కుర్రోళ్ళు(Committee Kurrollu). నిహారిక (Niharika) నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఇదే నెలలో రిలీజ్ అయిన ఈ రెండు చిన్న సినిమాలు పెద్ద ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు