NiharikaKonidela : నిహారికకు బన్నీ వాసు ఓపెన్ ఛాలెంజ్.. అసలేంటి మ్యాటరంటే!

NiharikaKonidela : మెగా డాటర్ నిహారిక కొణిదెలకు టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఓపెన్ ఛాలెంజ్ చేసాడు. దమ్ముంటే తేల్చుకుందామంటున్నాడు. నిహారిక కూడా అస్సలు తగ్గడం లేదు. ఆ వార్త విన్న ఆడియన్స్ కూడా కంగారు పడుతున్నారు. కానీ మేకర్స్ నుండి అప్డేట్ చూసాక అసలు విషయం వేరే ఉంది. అసలు విషయానికి వస్తే… బన్నీ వాసు నిర్మాతగా ‘ఆయ్’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. నార్నె నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాను అంజి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించాడు. ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

AAY Producer BunnyVas open challenge to CommitteeKurrollu producer NiharikaKonidela

అలాగే కమిటీ కుర్రోళ్ళు పేరుతో తెరకెక్కుతున్న విలేజ్ కామెడీ డ్రామా కూడా అతి త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాకు యాదు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడక్షన్స్ లో స్వయంగా నిర్మిస్తుంది. ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాల ప్రొడ్యూసర్లు బన్నీ వాసు, నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఢీ అంటే ఢీ అనేలా ఛాలెంజ్ చేసుకున్నారు. బన్నీ వాసు ఆటకు మీరు సిద్ధమా అంటే, నిహారిక ఓడిపోవడానికి సిద్ధమా అంటుంది.

- Advertisement -

తేల్చుకుందాం అంటున్న నిహారిక..

అసలు విషయం ఏంటంటే.. కమిటీ కుర్రోళ్లు, ఆయ్ సినిమాలు నిర్మించిన చిత్ర యూనిట్ రెండు జట్లు గా మారి క్రికెట్ ఆడబోతున్నారు. దానికి వీడియో లో పంచ్ డైలాగులు చెప్తూ, మీరు సిద్ధమా అంటూ.. అంటూ వీడియో రిలీజ్ చేసారు. కమిటీ కుర్రోళ్ళు టీమ్, అయ్ టీమ్ లు గా రెండు జట్లు ఏర్పడగా ఆయ్ టీమ్ కి కెప్టెన్ గా బన్నీ వాసు, కమిటీ కుర్రోళ్ళు టీమ్ కి కెప్టెన్ గా నిహారిక ఉండనున్నారు. జులై 19న క్రికెట్ టోర్నమెంట్ ఆడబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ మ్యాచ్ ఉండనుంది. మరి ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు