Abhinav Gomatam : ఈ దొంగలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో.?

కొందరు నటులు ఎన్ని సినిమాలు చేసినా కూడా సరైన గుర్తింపు రాదు. కానీ ఇంకొందరికి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు లభిస్తుంది. అంటే ఆ సినిమాలో ఆ పాత్రకు ఉన్న స్కోప్ ఆ పాత్రను పెర్ఫార్మన్స్ చేసిన తీరును బట్టి నటులుగా నిలద్రొక్కుకోవచ్చు. ఇకపోతే ఒక సినిమాతోనే అలా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులు తెలుగు ఫిల్మి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన “పెళ్లిచూపులు” సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు ప్రియదర్శి. పెళ్లిచూపులు సినిమాలో కౌశిక్ గా పరిచయమైన ప్రియదర్శి, కౌశిక్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన టైమింగ్ తో అద్భుతమైన కామెడి పండించి మొదటి సినిమాతోని ఎనలేని గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నాడు ప్రియదర్శి. తర్వాత హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ప్రియదర్శి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో హీరోగా ఒక సినిమాను చేయబోతున్నాడు.

సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా పరిచయమైన సినిమా అర్జున్ రెడ్డి. ఆ సినిమాలో అర్జున్ రెడ్డి ఫ్రెండ్ శివ క్యారెక్టర్ లో నటించాడు రాహుల్ రామకృష్ణ. అయితే ఆ సినిమాతోనే రాహుల్ రామకృష్ణ లోని టాలెంట్ అంతా తెలుగు తెరకు తెలిసి వచ్చింది. అక్కడితో రాహుల్ రామకృష్ణ కెరియర్ కి తిరుగులేకుండా పోయింది. వరుస అవకాశాలు రాహుల్ రామకృష్ణ కెరియర్ లో వచ్చాయి. అదే కాకుండా హీరోగా కూడా సినిమాలను చేయటం మొదలుపెట్టాడు రాహుల్ రామకృష్ణ.

- Advertisement -

ఇకపోతే తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొదటి రిలీజ్ అయినప్పుడు చాలామంది యూత్ ఎంజాయ్ చేశారు. కానీ కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ ని ఈ సినిమా తీసుకురాలేకపోయింది. కానీ రీ రీలీజ్ అప్పుడు మాత్రం ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు అద్భుతమైన కలెక్షన్లను ఈ సినిమాకి ఇచ్చారు.

ఇకపోతే ఈ సినిమాలో అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అభినవ్ గోమటం చేసింది. మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో, హాట్ కమలహాసన్ వంటి డైలాగ్స్ ఇప్పటికీ చాలామందికి గుర్తున్నాయంటే అది అభినవ్ చేసిన పర్ఫామెన్స్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇకపోతే అభినవ్ కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో అనే సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో అభినవ్ కూడా సిన్సియర్ గా తన ఎఫెర్ట్స్ పెట్టి ప్రేక్షకులను అలరించాడు.

ఇప్పుడు అభినవ్ చేస్తున్న సినిమా “మై డియర్ దొంగ” ఈ సినిమాలో అభినవ సరసన షాలిని కొండేపూడి నటిస్తుంది. కేవలం షాలిని సినిమాలో నటించడమే కాకుండా రైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా షాలిని ఈ సినిమాలో వర్క్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే షాలిని మల్టీ టాలెంటెడ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకే జయమ్మ పంచాయతీ వంటి సినిమాల్లో నటించింది షాలిని.

ఇకపోతే “మై డియర్ దొంగ” టీజర్ మార్చి 4న సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు స్వర్గన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి ప్లాట్ఫారంలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. 4వ తారీఖున రిలీజ్ అయ్యే టీజర్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనుంది చిత్ర యూనిట్. అన్నపూర్ణ స్టూడియోస్, క్యాం ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్టులో అసోసియేటెడ్ అయి ఉన్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు