Abhinaya Sree: టాలీవుడ్ లో విషాదం.. హీరోయిన్ తల్లి మృతి..!

Abhinaya.. ప్రముఖ కోలీవుడ్ నటి అభినయ (Abhinaya )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో , పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈమె గురించి మనందరికీ తెలియని విషయం ఏమిటంటే, ఈమె పుట్టుకతోనే బధిర. మాట్లాడలేదు , అలాగని వినలేదు కూడా.. అయినా సరే సినిమాలలో తన నటనతో మంచి పేరు సొంతం చేసుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అభినయ, ఆ తర్వాత శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, నేనింతే , రాజు గారి గది 2, కింగ్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

Abhinaya: Tragedy in Tollywood.. heroine's mother dies..!
Abhinaya: Tragedy in Tollywood.. heroine’s mother dies..!

అభినయ తల్లి మృతి ఎమోషనల్ పోస్ట్ వైరల్..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె, తాజాగా కంటతడి పెట్టించే పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా అభినయ తన ఇన్ స్టా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది. అందులో తన తల్లి మరణించినట్లు తెలిపింది. ఆ పోస్టులో .. అమ్మా.. నువ్వు లేవనే విషయాన్ని అసలు నమ్మలేకపోతున్నాను. ఆకస్మాత్తుగా మమ్మల్ని వదిలేసి ఈ లోకాన్ని విడిచి పోతారు అనుకోలేదు. తాత లాగే మీరు కూడా మమ్మల్ని ఒంటరి చేశారు. తాత లాగే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే మరణించావు. తండ్రి, కూతురు ఇద్దరూ కూడా ఇలా ఒకేలా మరణించడం ఎంత యాదృచ్ఛికమో కదా.. నువ్వు లేకుంటే ఇంత నేను సాధించేదాన్ని కాదు. ప్రతి విషయంలో కూడా ముందుండి నన్ను నడిపించావు. మళ్లీ జన్మంటూ ఉంటే నేను నీ కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం నా బాధ్యతను సాయి నందన్ తీసుకుంటాడు. రెస్ట్ ఫరెవర్ అమ్మ అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అభినయ.. అంతే ఇది చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటున్నారు. అభినయ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అంతేకాదు ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈమెకు ఇండస్ట్రీలో అన్ని తానే అయి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన అభినయ తల్లి ఇప్పుడు ఆమెను విడిచి వెళ్లిపోవడం నిజంగా బాధాకరం అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు.

అభినయ కెరియర్..

ఇక అభినయ కెరియర్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఆమె కోరిక ఆమెను ఎన్నో తిప్పలు పెట్టిందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఈమె పుట్టుకతోనే మూగ , చెవిటి కావడం. ఆమె చేసుకున్న దురదృష్టం. కానీ దేవుడు ఆమెకు అందం ఇచ్చాడు. నటించగలిగే ప్రతిభ ఇచ్చాడు. దానికి తోడు తన తల్లి ఆమెకు అండగా నిలిచింది. ఇక అవి ఈమెను ఉన్నత స్థాయికి చేర్చాయి. 2009లో వచ్చిన నాదో దిగల్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఆ తర్వాత తెలుగు, కన్నడ చిత్రాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు తెలుగు చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అభినయ.

 

View this post on Instagram

 

A post shared by M.g Abhinaya (@abhinaya_official)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు