RamCharan : అలా అంటే ఒప్పుకోము.. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అఫ్ ఇండియన్ సినిమా… – అభిషేక్ అగర్వాల్

RamCharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖ్యాతి RRR తర్వాత ఖండాంతరాలు దాటిపోయింది. ఎక్కడికి పోయినా చరణ్ పేరు మార్మోగిపోతోంది. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు లైన్లో పెట్టిన రామ్ చరణ్ తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న మెల్‌బోర్న్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ సినిమా, ఆర్ట్స్, కల్చర్‌ను రిప్రజెంట్ చేస్తూ రామ్ చరణ్ అక్కడ సందడి చేస్తున్నాడు. భారతీయ కళ, స్కృతికి ఆ ఫిల్మ్‌ ఫెస్టిల్‌లో బ్రాండ్‌ అంబాసిడర్‌ గా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు. రామ్ చరణ్, ఉపాసన సహా అక్కడికి విచ్చేయగా, అక్కడ చరణ్ కి అద్భుతమైన స్వాగతం లభించింది. ఇదిలా ఉండగా అక్కడ రీసెంట్ గా రామ్‌ చరణ్‌ “క్రికెట్‌ ప్రపంచ కప్‌‌” తో ఫోటోలకు పోజులిచ్చాడు.

Abhishek Agarwal says that RamCharan is a global star of Indian cinema

రామ్ చరణ్ ని అలా అంటే ఒప్పుకోము – అభిషేక్ అగర్వాల్

అయితే రామ్ చరణ్ తాజాగా వరల్డ్ కప్ ట్రోఫీతో పోజులివ్వగా, ఆ ఫోటోలను అధికారిక “క్రికెట్‌ ఆస్ట్రేలియా” వారు సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. కానీ అక్కడ రామ్ చరణ్ ని బాలీవుడ్ యాక్టర్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దీనిపై మెగాభిమానులు ఫైర్ అవుతున్నారు. చరణ్ బాలీవుడ్ కాదు, టాలీవుడ్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ విషయంపై అసహనం వ్యక్తం చేస్తూ, ట్విట్టర్‌ లో ఈ విషయం మీద కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. రామ్ చరణ్ ని బాలీవుడ్ స్టార్ అని సంబోధించడం పై పోస్ట్ చేసిన అభిషేక్ అగర్వాల్ ఇలా చెప్పుకొచ్చాడు… రామ్‌ చరణ్ గారికి ప్రపంచ వేదికలపై లభిస్తున్న గుర్తింపునకు చాలా సంతోషంగా ఉంది. అయితే రామ్ చరణ్‌‌ ని బాలీవుడ్‌ నటుడు అంటూ పిలవడాన్ని మేము ఒప్పుకోవడం లేదు. చరణ్‌ బాలీవుడ్‌ నటుడు కాదు.. ‘మా గ్లోబల్‌ స్టార్‌‌ను “ఇండియన్ స్టార్‌” లేదా “పాన్ ఇండియా స్టార్‌” అని పిలవండి. అంతే తప్ప బాలీవుడ్ నటుడు అంటూ పిలవడాన్ని మేము ఒప్పుకోము అంటూ అభిషేక్ అగర్వాల్ పోస్ట్ లో చెప్పుకొచ్చారు.

- Advertisement -

అలాగే రంగస్థలం వంటి సినిమాతో తనను ద్వేషించే వారి ప్రేమను కూడా గెలుచుకున్న రామ్‌ చరణ్ RRR తో వరల్డ్ వైడ్ గా తన నటనకు ప్రశంసలు అందుకుని, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి గర్వకారణమయ్యాడని అభిషేక్ అగర్వాల్ చెప్పుకొచ్చాడు. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కి రెడీ అవుతుండగా, త్వరలో ఈ సినిమా నుండి రెండో సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు