Abhishek Bachchan : ఒకేసారి 6 అపార్ట్మెంట్లు కొన్న అభిషేక్… ఒక్కో దాని ధర ఎంతంటే?

Abhishek Bachchan : ఇటీవల కాలంలో ఐశ్వర్య రాయ్ తో విడాకుల రూమర్లతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు అభిషేక్ బచ్చన్. తాజాగా ఈ హీరో ఏకంగా ఒకేసారి 6 అపార్ట్మెంట్లు కొన్నట్టు సమాచారం. మరి అభిషేక్ ఎక్కడ ఈ అపార్ట్మెంట్స్ కొన్నాడు? ఒక్కో అపార్ట్మెంట్ ధర ఎంత అనే విషయాలను తెలుసుకుందాం.

ముంబైలో 6 అపార్ట్మెంట్లు

ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని బోరివలి ప్రాంతంలో ఆరు అపార్ట్‌మెంట్లను కొన్నట్టు సమాచారం. ఇవి ఒబెరాయ్ రియల్టీ నిర్మిస్తున్న ఒబెరాయ్ స్కై సిటీ ప్రాజెక్ట్‌లో భాగమని తెలుస్తోంది. ఇందులో అభిషేక్ కొన్న అపార్ట్మెంట్ లకు అయిన మొత్తం ఖర్చు 15.42 కోట్లు. ప్రతి చ.అ.కు 31,498 చొప్పున మొత్తం 4,894 sqft RERA కార్పెట్‌ను ఆయన కొనుగోలు చేశారు.

ఒక్కో అపార్ట్మెంట్ ధర ఎంతంటే?

ఈ ఆరు అపార్ట్‌మెంట్లు బోరివలి ఈస్ట్‌లోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలో నిర్మిస్తున్న అత్యంత ఎత్తైన భవనంలోని 57వ అంతస్తులో ఉన్నాయి.
మే 28న దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరగ్గా, ఈ ప్రాపర్టీలలో 10 కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉండడం విశేషం. మొదటి అపార్ట్‌మెంట్‌ను 3.42 కోట్లకు, రెండవ, మూడవ అపార్ట్‌మెంట్‌లు ఒక్కొక్కటి 79 లక్షలకు అభిషేక్ కొన్నారు. నాల్గవ, ఐదవ అపార్ట్‌మెంట్‌లు 3.52 కోట్లు, 3.39 కోట్లకు, ఆరవ అపార్ట్‌మెంట్ ను కూడా 3.39 కోట్లకు అభిషేక్ సొంతం చేసుకున్నారు.

- Advertisement -

Take A Look At Abhishek Bachchan's Fitness And Diet Regime! | IWMBuzz

ఆ బిల్డర్స్ పై అభిషేక్ నమ్మకం

అభిషేక్ బచ్చన్ ఒబెరాయ్ రియల్టీ ద్వారా ఆస్తులపై పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఆగస్ట్ 2021లో అతను వర్లీలోని ఒబెరాయ్ రియాల్టీ ద్వారా ఒబెరాయ్ 360 వెస్ట్ ప్రాజెక్ట్‌లో భాగమైన ముంబైలోని అపార్ట్‌మెంట్‌ను 45.75 కోట్లకు అమ్మాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అభిషేక్ ఈ ప్రాపర్టీని 2014లో తిరిగి 41 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కొన్నాడు. కాగా అభిషేక్ ఇటీవల కొన్న ఆస్తుల గురించిన వివరాలు ఓ వెబ్ సైటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా బయటకు వచ్చింది.

ఐష్ తో అభిషేక్ విడాకులు

చాలా కాలంగా ఐష్, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బచ్చన్ ఫ్యామిలీ వ్యవహరిస్తున్న తీరు కూడా ఆ వార్తలకు ఆజ్యం పోసే విధంగానే ఉంది. తాజాగా అమితాబ్ రావణ్ మూవీ వచ్చి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేశారు. అందులో ఆయన కేవలం తన కొడుకుని మాత్రమే ప్రశంసలతో ముంచెత్తారు. అయితే అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన తన కోడలు ఐష్ గురించి కనీసం ప్రస్తావించలేదు. దీంతో మరోసారి ఐష్, అమితాబ్ విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అభిషేక్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్

అభిషేక్ ప్రస్తుతం దర్శకుడు షూజిత్ సిర్కార్‌తో ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 15న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంలో జానీ లీవర్, అహల్య బమ్రూ, జయంత్ క్రిప్లానీ కూడా నటిస్తున్నారు. అలాగే అభిషేక్ పైప్‌లైన్‌లో మరో ప్రాజెక్ట్ ఉంది. తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో హౌస్‌ఫుల్ 5 చేస్తున్నాడు. ఆయన చివరిసారిగా ZEE5లో అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ డ్రామా ఘూమర్‌లో కనిపించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు