HBD Abhishek Bachchan: గొప్ప భర్త అని నిరూపించుకున్న అభిషేక్.. ఏం చేశారంటే..?

HBD Abhishek Bachchan

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కుమారుడిగా అభిషేక్ బచ్చన్ తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు. బాలీవుడ్ లోనే కాదు తెలుగులోనూ తన సినిమాలను డబ్బింగ్ లో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ధూమ్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న అభిషేక్ బచ్చన్ ఈ రోజు తన 48వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. దీంతో అభిషేక్ బచ్చన్ కి సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ గా చేస్తున్నారు. వాటి గురించి చూద్దాం.

అభిషేక్ బచ్చన్ తన సినిమాలతోనే కాదు నటనతో కూడా మంచి పేరు అందుకున్నారు. అలాగే ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్యరాయ్ కి మంచి భర్తగా కూడా పేరు సంపాదించారు. ఐశ్వర్యరాయ్ గురించి ఎన్నో సందర్భాలలో అభిషేక్ బచ్చన్ పలు విషయాలను తెలిపారు.. ముఖ్యంగా ఆరాధ్య పుట్టిన సమయంలో మీడియాలో పలు రకాల వార్తలు వినిపించడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అభిషేక్ బచ్చన్. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. తమ జీవితంలోకి ఆరాధ్య రాక తర్వాత ఐశ్వర్యరాయ్ కెరియర్ కాస్త వెనుకబడిందని కామెంట్స్ చేశారు.

అంతే కాకుండా తమకు కూతురు ఆరాధ్య పుట్టిన తర్వాత ఐశ్వర్య చాలా బరువు పెరిగిపోయింది అంటూ మీడియా లో వార్తలు వచ్చాయని అభిషేక్ బచ్చన్ తెలిపారు. దీంతో తన భార్యపై ఇలా మీడియాలో రకరకాల వార్తలు రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజుకి కూడా  ఆరాధ్య కోసమే తన భార్య పనిచేస్తుందని.. ఆమె ఒక సూపర్ మామ్ అంటూ కితాబ్ ఇచ్చారు. తన కూతురు పుట్టిన వెంటనే ఐశ్వర్యరాయ్ బరువు పెరిగిందనే వ్యాఖ్యలు విన్న తర్వాత.. తనని చాలా బాధపెట్టిన విషయం ఇది అని తెలిపారు.

- Advertisement -

అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్యరాయ్ తనకంటే పెద్ద సూపర్ స్టార్ అనే విషయాన్ని చాలా గొప్పగా ఎన్నో సందర్భాలలో తెలిపారు. ఇలా తన భార్య విజయాన్ని కూడా ఎన్నోసార్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారు కానీ ఎప్పుడూ అసూయ పడలేదు.. తనకంటే ఎక్కువగా ప్రజాధరణ ఐశ్వర్యరాయ్ కి ఉందంటూ కూడా ఎన్నోసార్లు తెలిపారు.. ఈ విషయం పై తాను చాలా గర్వంగా ఉన్నానంటూ కూడా తెలిపారు.

అలాగే అభిషేక్ మాట్లాడుతూ.. ఒక మనిషిగా , భర్తగా ఐశ్వర్య భార్య తన కంటే మంచి స్థాయిలో ఉండడాన్ని చూడడం కంటే ఎక్కువ ఆనందం ఏది ఇవ్వదంటూ కూడా అభిషేక్ బచ్చన్ తెలియజేశారు. ఆమె ఎలాంటి అవార్డులు అందుకున్నా.. ఎక్కడికి వెళ్లినా ఆమెకు సపోర్టుగా తాను ఉంటానని కూడా తెలియజేశారు అభిషేక్ బచ్చన్.

ఇకపోతే వివాహమైన తర్వాత కూడా ఐశ్వర్యరాయ్ కి కెరియర్ పరంగా ఎటువంటి అడ్డంకులు కూడా చెప్పలేదు.. అభిషేక్ బచ్చన్ ఆమెని ఎంకరేజ్ చేస్తూ వచ్చారే తప్ప ఎలాంటి అడ్డంకులు పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే ఐశ్వర్యరాయ్ అభిషేక్ మధ్య ఎంతటి బాండింగ్ ఉందో అర్థమవుతుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు