Kalki: అశ్విని దత్ చెప్పినట్లు కల్కి టు 60 శాతం పూర్తి కాలేదట, అసలు నిజం ఏంటో నాగ్ అశ్విన్ చెప్పాడు

Kalki: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమాలుకు సరైన గౌరవం దక్కేది కాదు. ఇప్పుడు తెలుగు సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాని తెరకెక్కించిన తర్వాత తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ టైంలో ప్రభాస్ కూడా ఒక సినిమా కోసం ఐదు సంవత్సరాలను త్యాగం చేశాడు. ఒక సినిమా కోసం ఐదేళ్లు టైం ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. ప్రభాస్ అన్న టైం ఇవ్వడం బట్టి నేడు తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచానికి తెలిసిందే అని కూడా చెప్పొచ్చు.

ఆ సినిమా తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేశాడు. అయితే బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆది పురుష వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన ఫలితాన్ని తీసుకురాలేదు. కానీ ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ వలన మినిమం కలెక్షన్స్ను రాబట్టాయి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. రీసెంట్గా ప్రభాస్ నటించిన సినిమా కల్కి. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనం చూపిస్తుంది.

Kalki 2898 AD

- Advertisement -

కల్కి సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సాధించుకొని అద్భుతంగా కొనసాగుతుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానెర్ లో వచ్చిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా మంచి కలెక్షన్స్ తో పాటు ప్రశంసలను తీసుకొస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అశ్విని దత్ కల్కి 2 దాదాపు 60 శాతం పూర్తయిపోయింది అని చెప్పుకొచ్చారు. అయితే వాస్తవానికి కల్కి 2 సినిమా 60 శాతం పూర్తికాలేదట. కల్కి 2 సినిమాకి సంబంధించి కేవలం 25 నుంచి 30% వరకు మాత్రమే పూర్తయింది. ఒక 30 రోజులు మాత్రం సెకండ్ పార్ట్ కి సంబంధించి సూట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ అశ్విన్ వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు